Coronavirus in India:
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 3205 కరోనా కేసులు నమోదయ్యాయి. 31 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,88,118కి చేరింది. ఇందులో 4,25,44,689 మంది కోలుకోగా, మరో 5,23,920 మంది మృతి చెందారు. 19,509 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.05గా ఉంది. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. మరణాల రేటు 1.22 శాతంగా ఉంది.
వ్యాక్సినేషన్
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,89,48,01,203 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. మంగళవారం ఒక్కరోజే 4,79,208 మందికి వ్యాక్సిన్ అందించారు.
కరోనా ప్రభావం
కరోనా వైరస్ సోకిన వారిలో దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉందనే విషయంపై తాజాగా ఓ అధ్యయన షాకింగ్ విషయాలు చెప్పిింది. వైరస్ సోకినప్పుడు కొందరిలో స్వల్ప లక్షణాలు చాలా తక్కువ కాలమే ఉండి త్వరగానే కోలుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ తగ్గినా కూడా కొందరిలో కరోనా లక్షణాలు మాత్రం దీర్ఘకాలంగా కనిపిస్తున్నాయి. దీన్నే లాంగ్ కోవిడ్ అంటారు. దాదాపు 30 శాతం మందిని ఇలా లాంగ్ కోవిడ్ లక్షణాలు వేధిస్తున్నట్టు అధ్యయనంలో తెలిసింది.
వైరస్ సంబంధిత సూక్ష్మ వ్యాధి కణాల ప్రభావం వల్ల లక్షణాలు ఇంకా శరీరంలో ఉంటున్నాయని, అవి రోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని తేలింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెలస్ వారు నిర్వహించిన పరిశోధనలో చాలా మంది పోస్ట్ కోవిడ్ బాధితులు ఉన్నారని తేలింది. వారంతా కరోనా తాలూకు లక్షణాలతో నెలల పాటూ బాధపడుతున్నట్టు బయటపడింది. ముఖ్యంగా డయాబెటిస్, ఊబకాయం సమస్యలతో బాధపడుతూ కరోనా బారిన పడిన వారిలోనే లాంగ్ కోవిడ్ లక్షణాలు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: Hanuman Chalisa Row: ఎంపీ నవనీత్ రాణా దంపతులకు ఊరట- కండిషన్ బెయిల్ ఇచ్చిన కోర్టు
Also Read: Covid Pandemic: ఇదేముంది, రానున్న వేరియంట్ సృష్టించేది అంతకుమించి- బిల్‌గేట్స్ హెచ్చరిక