ఆమ్‌ ఆద్మీ పార్టీకి నేను కోట్లాది రూపాయాలు సమకూర్చాను. 2015 నుంచి సత్యేంద్ర జైన్‌తో నాకు పరిచయం ఉంది. ఆమ్‌ఆద్మీ పార్టీ విస్తరణ తర్వాత రాజ్యసభకు నామినేట్‌ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నాకు హామీ ఇచ్చింది. దీంతో ఆ పార్టీకి నేను రూ.50 కోట్లకు పైగా డబ్బు సమకూర్చాను. 2017లో నేను అరెస్టయిన తర్వాత తిహాడ్‌ జైల్లో ఉంచారు. అప్పుడు జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్‌ నన్ను కలిశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఇచ్చిన డబ్బు గురించి దర్యాప్తు సంస్థలకు ఏమైనా చెప్పావా? అని అడిగారు.  ఆ తర్వాత 2019లో మరోసారి అరెస్టయినప్పుడు సత్యేంద్ర జైన్‌ తన సెక్రటరీ, మరో సన్నిహితుడితో జైలుకు వచ్చి నన్ను కలిశారు. జైల్లో రక్షణ, సదుపాయాలు కల్పించాలంటే ప్రతినెలా తనకు రూ.2 కోట్లు కట్టాలని జైన్‌ డిమాండ్ చేశారు. అంతేగాక డీజీ (జైళ్లు) సందీప్‌ గోయెల్‌కు ప్రతినెలా రూ.1.5కోట్లు ఇవ్వాలన్నారు. నాపై ఒత్తిడి పెంచి కొన్ని నెలలు బలవంతంగా కట్టించుకున్నారు. అలా సత్యేంద్ర జైన్‌కు రూ.10 కోట్లు, సందీప్‌ గోయెల్‌కు రూ.12.5 కోట్లు చెల్లించాను. జైన్‌కు డబ్బులు ఇచ్చినట్లు నా వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలి.                     -  సుకేశ్‌ చంద్రశేఖర్