PM Modi on Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనను 'రావణ్' అని సంబోధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం స్పందించారు. అసలు రామాయణంపైనే నమ్మకం లేని కాంగ్రెస్ తనను రావణుడు అనడం హాస్యాస్పదంగా ఉందని మోదీ కౌంటర్ ఇచ్చారు.
ఖర్గే విమర్శలు
అహ్మదాబాద్‌లోని బెహ్రాంపురాలో సోమవారం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని రావణుడితో పోల్చారు.
[quote author=మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు ]ప్రతిచోటా మీ [ప్రధాని మోదీ] చిత్రమే కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు లేదా సాధారణ ఎన్నికలు ఇలా ఎక్కడ చూసినా మీ చిత్రమే. మీ ముఖాన్ని మేము ఎన్నిసార్లు చూస్తాం? మీరేమైనా 100 తలలున్న రావణుడా? [/quote]
ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అనుచిత పదాలు ఉపయోగించిన ప్రతిసారీ గుజరాత్ ప్రజలు బ్యాలెట్ బాక్స్ ద్వారానే సమాధానం చెప్పారని షా అన్నారు. ఈసారి కూడా రాష్ట్ర ప్రజలు తగిన సమాధానం చెబుతారని అమిత్ షా అన్నారు.
Also Read: CM Mamata Steers Boat: బోటు నడిపిన సీఎం మమతా బెనర్జీ- వైరల్ వీడియో!