ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన


టీడీపీ అధినేత చంద్రబాబు  ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మూడురోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. అందులో భాగంగా ఈ రోజు కొయ్యలగూడెం  మండలం నరసన్న పాలెం విలేజ్ లోని దండమూడి రామలక్ష్మి ఫంక్షన్ నుండు ఉదయం 10:30 కు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు పోలవరం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల వరకూ అక్కడే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తరువాత రాత్రి 7 గంటలకు కొవ్వూరులోని గోదావరి మాత విగ్రహం వద్దకు చేరుకుంటారు. ఆ విగ్రహం నుండి మెరక వీధి, బస్ స్టాండ్, విజయ విహార్ సెంటర్ వరకూ రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి 8 నుండి 9 వరకూ విజయ విహార్ సెంటర్ లో బహిరంగ సభలో పాల్గొంటారు చంద్రబాబు. 9 గంటలకు కొవ్వూరులోని సుందర సాయి నిగమం ఫంక్షన్ హాల్ చేరుకుని అక్కడే నైట్ హాల్ట్ చేస్తారు.


రాజమండ్రిలో మూడో రోజు జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు


రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో మూడో రోజు జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు జరుగనున్నాయి. దానిలో గత రెండు రోజుల తరహాలోనే పలువురు మంత్రులు పాల్గొననున్నారు.


విశాఖలో నేవీ డే రిహార్సల్స్


డిసెంబర్ 4 న జరిగే నేవీ డే కోసం గత వారం రోజులుగా విశాఖలోని ఆర్కే బీచ్ లో నేవీ యుద్ద విన్యాసాలు, బ్యాండ్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ రోజు కూడా నేవీ యుద్ధ విన్యాసాలు జరగనున్నాయి.


ఈరోజు ఎమ్మెల్యే గంటా పుట్టినరోజు, కీలక నిర్ణయం?


విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పుట్టినరోజు నేడు. ఆయన రాజకీయ భవిష్యత్ పై ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో ఆయన అభిమానులు అంతా ఈరోజు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన షిరిడీలో ఉన్నట్టు ఆయన కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.