Condoms in School Bags:
ఆకస్మిక తనిఖీలు..
కర్ణాటకలోని ఓ స్కూల్‌లో విద్యార్థుల బ్యాగ్‌లు చెక్ చేయగా...కండోమ్స్, సిగరెట్లు బయటపడ్డాయి. ఇవి చూసి టీచర్లు షాక్ అయ్యారు. మొబైల్ ఫోన్స్ ఎవరూ వాడొద్దని ఆంక్షలు పెట్టిన టీచర్లు..అందరి బ్యాగ్‌లు చెక్ చేశారు. అయితే అందులో సెల్‌ఫోన్లతో పాటు కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలు, లైటర్‌లు, సిగరెట్‌లు, వైట్‌నర్స్ కనిపించాయి. 8,9,10వ తరగతి విద్యార్థుల బ్యాగ్‌లలో ఇవి ఉన్నాయి. బెంగళూరులోని పలు స్కూల్స్‌లో ఇలా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. క్లాస్‌రూమ్స్‌లోకి మొబైల్స్ తీసుకొస్తున్నారన్న ఫిర్యాదుతో అధికారులు అన్ని స్కూల్స్ లోనూ తనిఖీలు చేశారు. ప్రైమరీ,సెకండరీ స్కూల్స్ అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్స్ (KAMS) ఈ మేరకు అన్ని స్కూల్ యాజమాన్యాలకూ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బ్యాగ్‌లో ఆ సరంజామా అంతా బయటపడింది. వెంటనే ఆ విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి మీటింగ్ పెట్టారు. "ఇది తెలిసి తల్లిదండ్రులు కూడా మాలాగే షాక్ అయ్యారు. వాళ్ల పిల్లల వైఖరిలో ఈ మధ్య మార్పు వచ్చిందని చెప్పారు" అని స్కూల్ ప్రిన్సిపల్ చెప్పారు. ఈ విద్యార్థులను సస్పెండ్ చేయడం కాకుండా...కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అన్ని స్కూల్స్‌కి ఇప్పటికే దీనిపై నోటీసులు అందాయి. "స్కూల్స్ మేము రెగ్యులర్‌గా కౌన్సిలింగ్ ఇస్తున్నాం. అయినా..తల్లిదండ్రుల సపోర్ట్ కూడా అవసరం. అందుకే..ఓ 10 రోజుల పాటు విద్యార్థులకు సెలవులిచ్చాం. పేరెంట్స్ కాస్త చొరవ చూపించి వాళ్లకు మంచి చెడు నేర్పించాలి" అని ప్రిన్సిపల్ వెల్లడించారు. మరో స్కూల్‌లో బ్యాగ్‌లు చెక్ చేస్తుండగా..పదో తరగతి అమ్మాయి బ్యాగ్‌లో కండోమ్ కనిపించింది. ఇదేంటని ఆ యువతిని ప్రశ్నించగా..అదంతా తన స్నేహితుల పనేనని మాట దాటేసింది. బెంగళూరులోని 80% స్కూల్స్ చెకింగ్ పూర్తైంది. కొందరి దగ్గర గర్భనిరోధక మాత్రలూ కనిపించాయి.
ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో రచ్చ..
క్లాస్‌ల్లోకి మొబైల్స్ తీసుకెళ్లడం చాలా స్కూల్స్‌లో కామన్ అయిపోయింది. ఈ మధ్యే తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మేనూర్ ఆదర్శ పాఠశాలలోని ఇంటర్మీడియట్ విద్యార్థినులను ఓ టీచర్ విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో విద్యార్థులు తెలుగు టీచర్ ను సస్పెండ్ చేయాలంటూ పాఠశాల ముందు నిరసన చేపట్టారు. తెలుగు టీచర్ కొంతకాలంగా విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. కొంత మంది విద్యార్థులు ఆమె ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో సోది క్లాసు అంటూ పోస్ట్ చేశారు. టీచర్ కు ఈ విషయం తెలియడంతో విద్యార్థులను పిలిపించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఎవరు అంటూ ప్రశ్నించారు. దీంతో పోస్ట్ చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు తప్పయిందంటూ మరొకసారి ఇలా చేయమంటూ క్షమాపణలు కోరారు. అయినా కోపంతో తెలుగు టీచర్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన విద్యార్థినులను పచ్చి కట్టెలు విరిగేలా విచక్షణా రహితంగా కొట్టారు. ఇక్కడ కారణాలు వేరే అయినా...తరగతి గదుల్లోకి మొబైల్స్ తీసుకెళ్లడం మాత్రం అన్ని చోట్లా కనిపిస్తోంది.
Also Read: Arvind Kejriwal: 'సార్, మీరు మఫ్లర్ ఎందుకు వేసుకోలేదు'- కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన యువతి