Stock Market Closing 30 November 2022:
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడ్డాయి. వరుసగా ఏడో సెషన్లో సరికొత్త గరిష్ఠాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్లతో సంబంధం లేకుండా మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 140 పాయింట్ల లాభంతో 18,758 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 417 పాయింట్ల లాభంతో 63,099 వద్ద ముగిశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి 18 పైసలు బలపడి 81.42 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 62,681 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,743 వద్ద మొదలైంది. 62,648 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,303 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 417 పాయింట్ల లాభంతో 63,099 వద్ద ముగిసింది.
NSE Nifty
మంగళవారం 18,618 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,625 వద్ద ఓపెనైంది. 18,616 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,816 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 140 పాయింట్ల లాభంతో 18,758 వద్ద స్థిరపడింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చింది. ఉదయం 43,122 వద్ద మొదలైంది. 42,880 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,332 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 177 పాయింట్ల లాభంతో 43,231 వద్ద క్లోజైంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 45 కంపెనీలు లాభాల్లో 4 నష్టాల్లో ముగిశాయి. హిందాల్కో, గ్రాసిమ్, ఎస్‌బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సెమ్, ఐచర్ మోటార్స్ షేర్లు పరుగులు పెట్టాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ నష్టపోయాయి. పీఎస్‌యూ మినహా మిగతా రంగాల సూచీలన్నీ గ్రీన్‌లో కళకళలాడాయి. రియాల్టీ, మెటల్, ఆటో సూచీలు ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.