Arvind Kejriwal: ఓవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు దిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంతో ఆమ్‌ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బిజీబిజీగా ఉన్నారు. అయితే దిల్లీలో ప్రచారంలో ఉన్న కేజ్రీవాల్‌ను ఓ యువతి "సర్ మీరు మఫ్లర్ ఎందుకు వేసుకోలేదు" అని ప్రశ్నించింది. దీనికి కేజ్రీవాల్ కూడా అంతే క్రేజీగా బదులిచ్చారు.
ఇదీ జరిగింది
దిల్లీలో డిసెంబర్ 4న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆమ్‌ఆద్మీ పార్టీ తరపున ప్రచారం కోసం దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిరుగుతున్నారు. ఆ సమయంలో ఓ అమ్మాయి "సర్ మీరు మఫ్లర్ ఎందుకు వేసుకోలేదు?" అని అడిగింది. దీనికి కేజ్రీవాల్ నవ్వుతూ "ఇంకా అంతా చలిగా లేదు" అని బదులిచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఆమ్‌ఆద్మీ పార్టీ "ప్రజల సీఎం"అని రాసుకొచ్చింది.
మఫ్లర్ లుక్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన మఫ్లర్ లుక్‌తో బాగా పాపులర్ అయ్యారు. అయన శీతాకాలంలో చలి నుంచి రక్షణ పొందడనికి మఫ్లర్ ధరించేవారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో సీబీఐ వాళ్ళు తన ఇంట్లో సోదాలు నిర్వహించగా లెక్కలేనన్ని మఫ్లర్లు తప్ప ఏమి దొరకలేదు అని ఓసారి కేజ్రీవాల్ వ్యంగ్యంగా చెప్పారు.
కేజ్రీవాల్‌కు ఇలాంటి ప్రశ్న ఎదురవడం ఇదేం తొలిసారి కాదు. 2019లో ఓ ట్విట్టర్ వినియోగదారుడు కనిపించని మఫ్లర్ గురించి అడగగా, "మఫ్లర్ చాలా కాలం క్రితమే బయటకు వచ్చిందని, ప్రజలే గుర్తించట్లేదు" అని బదులిచ్చారు.
Also Read: Kerala Govt: కొత్త బిల్లు ప్రవేశపెట్టనున్న కేరళ సర్కార్- గవర్నర్‌ను తప్పించేందుకు!