అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యం ఏర్పడిన తర్వాత అరాచకాలు మరీ ఎక్కువయ్యాయి. మహిళలు, జర్నలిస్టులపై తాలిబన్లు అకృత్యాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. అయితే తాజాగా తాలిబన్లు 12.3 మిలియన్ అమెరికా డాలర్లు, కొంచెం బంగారం 'ద అఫ్గానిస్థానన్ బ్యాంక్ (డీఏబీ)'కు అప్పజెప్పారు. తాము పారదర్శకంగా ఉండాలనుకున్నట్లు చెప్పారు.
ఈ డబ్బు, బంగారం పాత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల ఇళ్లు, కార్యాలయాల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మానవతా సాయం కింద అఫ్గానిస్థాన్‌కు మిలియన్ డాలర్లను ఇవ్వడంపపై తాలిబన్లు కృతజ్ఞతలు తెలిపారు. ఇతర దేశాలతో తాము మంచి సంబంధాలను కోరుకుంటున్నట్లు ప్రస్తుత తాలిబన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ వెల్లడించారు. అమెరికాతో కూడా తాము స్నేహాన్నే కోరుకుంటున్నామన్నారు.
ప్రపంచదేశాలు చేసిన ఈ సహాయాన్ని ప్రజలందరికీ సమానంగా పంచుతామన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ స్థాయి బ్యాంకులు.. అఫ్గాన్‌లో విద్య, వైద్య సదుపాయాలకు సాయం చేయాలని కోరారు.
Also Read: Chardham Yatra: చార్‌ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ!
పాక్ ప్రధాని..
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లతో కలిసి పనిచేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. అక్కడి మహిళల హక్కులతో పాటు అన్ని వర్గాలను కులుపుకుని ఏర్పడే సమ్మిళత ప్రభుత్వ ఏర్పాటు విషయంలో వారిని ప్రోత్సహించాలని సూచించారు. ఈ మేరకు ఓ అంతర్జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.
Also Read: TIME Most Influential People: ఆ జాబితాలో భారత ప్రధాని మోదీ, బంగాల్ బెబ్బులి దీదీకి చోటు