Kerala Landslides News Today: కేరళలోని వయనాడ్‌ విధ్వంసంలో మృతుల సంఖ్య 300 దాటింది. శిథిలాలు తవ్వే కొద్దీ శవాలు బయట పడుతున్నాయి. వాటికి పోస్ట్‌మార్టం చేయడానికి కూడా వైద్యులు వణికిపోతున్నారు. ఎక్కడ చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. 200 మంది గల్లంతయ్యారు. వాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే...కొద్ది రోజుల క్రితం 8వ తరగతి విద్యార్థిని రాసిన లెటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కొండ చరియలు విరిగి పడితే ఏం జరుగుతుందో ఓ కథ రాసింది. అచ్చం ఆ కథలో జరిగినట్టే విధ్వంసం జరిగింది. "భారీ వర్షం కురిస్తే కొండ చరియలు విరిగి పడతాయి. అవి జలపాతాలను తాకుతాయి. అక్కడి నుంచి వరదలు ఉప్పొంగుతాయి. దారిలో ఉన్న వాటన్నింటినీ ముంచేస్తాయి. మనుషుల ప్రాణాలూ పోతాయి" అని ఆ కథలో రాసింది. స్కూల్ మ్యాగజైన్ కోసం గతేడాది ఇదంతా రాసింది. సరిగ్గా సంవత్సరం తరవాత..అంటే ఇప్పుడు అదే జరిగింది. చూరల్‌మలను ఈ విషాదం ముంచెత్తింది. ఆ విద్యార్థిని చదువుతున్న స్కూల్‌ కూడా ధ్వంసమైపోయింది. తన తండ్రినీ కోల్పోయినట్టు Indian Express వెల్లడించింది. (Also Read: Himachal Pradesh: హిమాచల్ ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్‌లు, రెడ్ అలెర్ట్ జారీ చేసిన IMD - గల్లంతైన వారి కోసం గాలింపు )


ఓ అమ్మాయి జలపాతంలో పడి చనిపోతుంది. ఆమె ఆ తరవాత పక్షి రూపంలో వచ్చి తన తోటి స్నేహితులకు వచ్చే ప్రమాదం గురించి హెచ్చరిస్తుంది. తల్లిదండ్రులకు చెప్పకుండా వాటర్‌ఫాల్స్‌ని చూసేందుకు వచ్చిన ఫ్రెండ్స్‌కి వెళ్లిపోమని ఆ పక్షి చెబుతుంది. సరిగ్గా అదే సమయంలో ఆ ఇద్దరు అమ్మాయిలు వెనక్కి తిరిగి చూస్తారు. వరద నీళ్లు ముంచుకొస్తుంటాయి. వెంటనే ఆ పక్షి ఓ బాలిక రూపంలోకి మారిపోయి వాళ్లిద్దరినీ కాపాడుతుంది. ఇదీ ఆ విద్యార్థిని రాసిన కథ. ప్రస్తుతం వయనాడ్‌లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఈ నెల 6వ తేదీన తెల్లవారుజామున ఒక్కసారిగా కొండ చరియలు విరిగి పడ్డాయి. కింద ఉన్న ఇళ్లు ధ్వంసమయ్యాయి. మెప్పడి, మందక్కై, చూరల్‌మలలో బీభత్సం సృష్టించిందీ విపత్తు. ప్రస్తుతానికి ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. 


Also Read: Wayanad: వయనాడ్ విధ్వంసంలో పెరుగుతున్న మృతుల సంఖ్య, శిథిలాలు తొలగించే కొద్దీ బయట పడుతున్న శవాలు