Sheep Walking In Circle:
సర్కిల్ ఆకారంలో తిరుగుతూ..
ఈ ప్రపంచంలో ఎన్నో మిస్టరీలు ఇప్పటికీ మిస్టరీలుగానే ఉండిపోయాయి. వాటి గుట్టు తెలుసుకోడానికి ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా... వాటి అంతు చిక్కడం లేదు. ఇప్పుడు కొత్తగా..చైనాలో ఓ మిస్టరీ అందరి బుర్రలకు పని పెడుతోంది. మంగోలియాలో ఓ వింత సంఘటన జరిగింది. ఓ గొర్రెల మంద అదే పనిగా సర్కిల్ ఆకారంలో తిరుగుతూ అందరినీ షాక్‌కి గురి చేస్తున్నాయి. కాసేపు కూడా ఆపకుండా అలా తిరుగుతూనే ఉన్నాయి. మంగోలియాలోని అతి పెద్ద గొర్రెల షెడ్‌లో కొన్ని గొర్రెలు దాదాపు 12 రోజులుగా ఇలా గుండ్రంగా తిరుగుతూనే ఉన్నాయి. అక్కడి సీసీటీవీలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో చూసిన అధికారులు ఆశ్చర్యపోతున్నారు. చైనాకు చెందిన పీపుల్స్ డైలీవార్తా సంస్థ ట్విటర్‌లో ఈ వీడియో షేర్ చేసింది. "గొర్రెలు ఆరోగ్యకరంగా ఉన్నాయి. కానీ...ఇవి ఎందుకిలా వింతగా ప్రవర్తిస్తున్నాయన్నది మాత్రం అంతు చిక్కడం లేదు" అని ట్వీట్ చేసింది. చాలా రోజులుగా...ఈ మిస్టరీని ఛేదించేందుకు సైంటిస్ట్‌లు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే...ఇటీవలే ఓ సైంటిస్ట్ గొర్రెల వింత ప్రవర్తన వెనక కారణమేంటో కనుగొన్నారు. మొత్తానికి చైనాలో ఈ ఘటన స్థానికంగా అలజడి సృష్టిస్తోంది.
హార్ట్‌పురి యూనివర్సిటీలోని ప్రొఫెసర్ మాట్‌బెల్ దీనిపై వివరణ ఇచ్చారు. "ఈ గొర్రెలు చాలా కాలంగా ఒకే చోట ఉండిపోయాయి. ఈ కారణంగానే వాటి ప్రవర్తన మారిపోయింది. ఒకేచోట ఉండిపోవడం వల్ల ఆ అసహనం, కోపంతో అలా గుండ్రంగా తిరుగుతున్నాయి. అవి ఇంకా షెడ్‌లోనే ఉండిపోయినట్టు భావిస్తున్నాయి. ఇది వాటి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఒక గొర్రె ఇలా తిరగడం చూసి...క్రమంగా అన్ని గొర్రెలూ దాన్ని అనుసరించాయి" అని వివరించారు. నవంబర్ 4వ తేదీ నుంచి ఇవి ఇలా వింతగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది. కనీసం తినడానికైనా అవి కాసేపు ఆగుతున్నాయా లేదా అన్నది మాత్రం తెలియడం లేదు. అయితే...ఈ గొర్రెల యజమాని ఓ సంచలన విషయం చెప్పాడు. "మా వద్ద మొత్తం 34 పెన్స్ (గొర్రెలను ఉంచే ప్రాంతం) ఉన్నాయి. వీటిలో 13వ పెన్‌లో ఉంచిన గొర్రెలు మాత్రమే ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాయి" అని స్పష్టం చేశాడు.
Also Read: Elon Musk Net Worth: రోజుకు రూ.రెండున్నర వేల కోట్ల నష్టం, సగం సంపద ఆవిరి, ఇప్పటికీ ఆయనే నంబర్.1