China's Covid Surge:
జ్వరం మందులకు కొరత..
చైనాలో అనూహ్య స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైద్యం అందించేందుకు ఉన్న సిబ్బంది చాలడం లేదు. వైద్య సౌకర్యాలూ సరిపోవడం లేదు. ఇప్పుడు మందుల కొరత కూడా నెలకొంది. ఫ్లూ లక్షణాల నుంచి బయటపడటానికి అందరూ జ్వరం మందులు కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు పెయిన్ కిల్లర్స్ కూడా కొంటున్నారు. డిమాండ్ ఒక్కసారి పెరిగిపోయింది. ఫలితంగా...ఆ మందులకు కొరత ఏర్పడింది. చైనాలోనే కాదు. మిగతా దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. Tylenol,Advil లాంటి జనరిక్ మందులకూ డిమాండ్పె రుగుతోంది. హాంగ్‌కాంగ్, మకావ్, తైవాన్, ఆస్ట్రేలియాల్లోని బడా ఫార్మా కంపెనీలు కూడా డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేయలేకపోతున్నాయి. పైగా...ఆయా కంపెనీలు ఈ విక్రయాలపై ఆంక్షలూ విధించాయి. అందుకే...కొందరు ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు. కరోనా ప్రభావాన్ని
తగ్గించే ఆహారం తీసుకుంటున్నారు. ఇక అమెరికా, కెనడాలోనూ ఇదే పరిస్థితులున్నాయి. పిలల్ల పెయిన్ కిల్లర్స్‌కీ విపరీతమైన డిమాండ్ ఉన్నా...ఆ స్థాయిలో సప్లై లేదు. పైగా...చిన్న పిల్లల్లో కరోనా సోకగానే...శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనాకు తోడు చలికాలం కావడం వల్ల ఆస్తమాతోనూ ఇబ్బందులు పడుతున్నారు. అధిక మోతాదులో ఈ మందులు తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఈ కొరత రావడానికి ప్రధాన కారణం.. చాలా మంది ముందస్తు జాగ్రత్తగా బల్క్‌గా కొనుగోలు చేస్తున్నారు. కొన్ని తమ వద్ద ఉంచుకుని మిగతావి వాళ్ల స్నేహితులు, బంధువులకు పంపుతున్నారు. అందరూ ఇలా భారీగా కొనుగోలు చేయడం వల్ల క్రమంగా మార్కెట్‌లో అందుబాటులో లేకుండా పోతున్నాయి. చాలా రోజుల నుంచి పరిచయం ఉన్న వారికోసం కొందరు మెడికల్ షాప్‌ల ఓనర్లు ప్రత్యేకంగా మందులు పక్కకు తీసి పెడుతున్నారు. వాళ్లకు మాత్రమే వాటిని విక్రయిస్తున్నారు. కొరత రావడానికి ఇది కూడా ఓ కారణమే.
అలా చనిపోతేనే..
జిన్‌పింగ్ ప్రభుత్వం ఇప్పుడు "మరణానికి నిర్వచనం"మార్చేసింది. ఈ నిబంధన ప్రకారం..ఎవరైనా శ్వాస సంబంధింత సమస్యలతో మరణిస్తేనే వారిని "కొవిడ్ మృతుల" జాబితాలో చేర్చుతారు. కరోనా కారణంగా మిగతా ఎలాంటి ఇబ్బంది కలిగి చనిపోయినా...వాటిని కరోనా మరణాలుగా పరిగణించరు. ఇప్పటికే చైనాపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతుండగా...ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుంది ఆ ప్రభుత్వం. ఇక అక్కడి ఆసుపత్రులు కరోనా బాధితులతో కిటకిటలా డిపోతున్నాయి. అక్కడి అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం..డిసెంబర్ 20న కేవలం ఇద్దరు మాత్రమే కొవిడ్ కారణంగా చనిపోయారు. అంతకు ముందు రోజు కూడా ఇద్దరే మరణించారని లెక్కలె చెప్పారు. అయితే..సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ మాత్రం శ్మశానాల వద్ద భారీ సంఖ్యలో శవాలను పేర్చి పెట్టారని వార్త రాసింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, అక్కడి పరిస్థితులు ఏ పొంతనా కుదరడం లేదు. ట్విటర్‌లో అక్కడి పరిస్థితులకు సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ప్రభావం మిగతా దేశాలపైనా పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారత్ అప్రమత్తమైంది.
Also Read: Jane Zhang Covid Positive: కావాలని కరోనా తెచ్చుకున్న చైనీస్ సింగర్, తిట్టిపోస్తున్న నెటిజన్లు