China Billionaires Flies to Singapore:


చైనా నుంచి వలసలు..


చైనా బిలియనీర్లంతా సింగపూర్‌కు క్యూ కడుతున్నారు. తమ దేశంలోనే కొనసాగితే డబ్బుకి సేఫ్టీ ఉండదన్న అనుమానంతో అక్కడి నుంచి సింగపూర్‌కు వలస వెళ్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ బిలియనీర్లపై ప్రత్యేక నిఘా పెడుతోంది. పదేపదే అనుమానిస్తోంది. ఈ టెన్షన్ తట్టుకోలేక దేశం వదిలి వెళ్లిపోతున్నారు. వీటితో పాటు జీరో కొవిడ్ పాలసీతో దేశం అతలాకుతలమైంది. ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం పడింది. ఇలాంటి పరిస్థితుల్లో తాము అక్కడే ఉండటం సేఫ్ కాదని భావిస్తున్నారు బిలియనీర్లు. ఒకరి తరవాత ఒకరు వరుసగా సింగపూర్‌కు టికెట్‌లు బుక్ చేసుకుంటున్నారు. కుబేరులంతా వస్తుంటే సింగపూర్‌ మాత్రం ఎందుకు కాదంటుంది. రెడ్ కార్పెట్ వేసి మరీ వాళ్లను ఆహ్వానిస్తోంది. ప్రస్తుతానికి సింగపూర్ మాత్రమే సేఫ్ అని అనుకుంటున్నారు బిలియనీర్లు. అక్కడ రాజకీయ అనిశ్చితి లేదు. 6 దశాబ్దాలుగా ఒకే ఒక పార్టీ రూల్ చేస్తోంది. లేబర్ స్ట్రైక్‌లు లేవు. వీధుల్లోకి వచ్చి గొడవలు చేయడమూ ఆ ప్రభుత్వం నిషేధించింది. అంటే...అల్లర్లకు ఆస్కారం ఉండదు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం సింగపూర్‌లో ట్యాక్స్‌లు తక్కువ. బిలియనీర్ల రాకతో సింగపూర్‌లోని కాస్ట్‌లీ గేటెడ్ కమ్యూనిటీలకు డిమాండ్ పెరుగుతోంది. థీమ్‌పార్క్‌లు, క్యాసినోలూ బిజీ అయిపోతున్నాయి. కొన్ని కంపెనీలు ముందుకొచ్చి బిలియనీర్లకు విలాసవంతమైన ఇళ్లను దగ్గరుండి మరీ చూపిస్తున్నాయి. 


జాక్‌ మాతో మొదలు..! 


నిజానికి చైనా బిలియనీర్ జాక్‌ మా ప్రస్తుతం సింగపూర్‌లోనే ఉంటున్నారు. ఆయనతో మొదలయ్యాయి వలసలు. చైనా ప్రభుత్వం ఆంక్షల కారణంగా దాదాపు 25 బిలియన్ డాలర్ల సంపద పోగొట్టుకున్నారు జాక్‌మా. వ్యక్తిగతంగానూ ఆయనను కాస్త ఇబ్బంది పెట్టారు. ఇదంతా తట్టుకోలేకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయి...దాదాపు ఏడాదిన్నర తరవాత సింగపూర్‌లో కనిపించారు. "మా సంపదను సేఫ్‌గా 
ఉంచుకోవాలంటే ఇదొక్కటే మార్గం" అని తేల్చి చెప్పేస్తున్నారు చైనా బిలియనీర్లు. అంతే కాదు. దీన్ని ఓ బ్యాకప్‌ ప్లాన్‌గానూ చెబుతున్నారు.


ప్రపంచంలో అత్యధిక జనాభా ఎక్కువగా ఉన్న దేశం ఏదంటే...చైనా అని అందరం ఠక్కున సమాధానం చెప్పేస్తాం. ఆ తరవాత భారత్‌లోనూ అదే స్థాయిలో జనాభా ఉంది. పాపులేషన్‌కి అంత పాపులారిటీ సంపాదించిన చైనా...ఇప్పుడు ఆ విషయంలో వెనకబడుతోంది. గత ఆరు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా గతేడాది జనాభా తగ్గిపోయింది. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్‌ వెల్లడించిన లెక్కల ప్రకారం చూస్తే...
సుమారు 142 కోట్లుగా ఉన్న జనాభాలో 8 లక్షల 50 వేల మేర తగ్గింది. 1961 తరవాత ఈ స్థాయిలో జనాభా తగ్గడం ఇదే తొలిసారి. ఈ కారణంగా...భారత్‌ ఖాతాలో ఓ రికార్డు చేరనుంది. ఇప్పటి వరకూ జనాభా విషయంలో చైనా ముందంజలో ఉండగా...ఇప్పుడా స్థానాన్ని భారత్ భర్తీ చేసేందుకు అవకాశాలున్నాయి. ఐక్యరాజ్య సమితి నిపుణులు 2022లోనే ఇండియా జనాభాను అంచనా వేశారు. 141కోట్ల జనాభా ఉన్నట్టు తెలిపారు. అయితే..చైనాను దాటేసి మరీ భారత్‌ ముందు వరసలో నిలబడుతుందని వాళ్లు ఊహించలేదు. ఇప్పుడు చైనా జనాభా తగ్గడం వల్ల త్వరలోనే భారత్‌ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా రికార్డు సృష్టించే అవకాశముంది. 


Also Read: SL 75th Independence Day: తప్పులు సరిదిద్దుకుందాం, మళ్లీ బలంగా నిలబడదాం - శ్రీలంక అధ్యక్షుడు