China Restaurant Fire: చైనాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. చాంగ్‌చున్‌లో ఉన్న ఓ రెస్టారెంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మరో ముగ్గురు మంది గాయపడ్డారు.
ఇదీ జరిగింది
జిలిన్ ప్రావిన్సులో చాంగ్‌చున్ సిటీ ఉంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అగ్నిమాపక వాహనాల సాయంతో మంటల్ని ఆర్పేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల
చైనాలో ఇటీవల భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రల్ చైనాలోని చాంగ్షాలో ఓ టెలికామ్ బిల్డింగ్‌లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. మొత్తం బిల్డింగ్ అంతా మంటల్లో తగలబడిపోయింది. ఈ మంటలతో చుట్టు పక్కల ప్రాంతాల్లో పొగ కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. చైనా టెలికాం బిల్డింగ్ తగలబడిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: Ankita Bhandari Murder Case: అంకిత కుటుంబానికి భారీ ఆర్థిక సాయం- ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో కేసు విచారణ
Also Read: Viral Video: ఉడతను చూసి పారిపోయిన ఉక్రెయిన్ సైనికులు!