China President Xi Jinping: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ గృహ నిర్బంధంలో ఉన్నారంటూ ఇటీవల సంచలన వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవమని తేలిపోయింది. దశాబ్ద కాలంలో చైనా కమ్యూనిస్టు పార్టీ, దేశం సాధించిన ఘనతలపై బీజింగ్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రదర్శనలో జిన్‌పింగ్ పాల్గొన్నారు. ఈ మేరకు చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది.


ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సుకు వెళ్లి ఈ నెల 16న తిరిగి చైనా వచ్చారు జిన్‌పింగ్‌. అయితే ఆ తర్వాత ఆయన బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి. ఆయన కనిపించకపోయేసరికి సోషల్ మీడియాలో వివిధ వార్తలు వచ్చాయి.


హౌస్ అరెస్ట్!


చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచినట్లు సోషల్ మీడియా సహా ప్రధాన మీడియా ఛానళ్లలో ఇటీవల వార్తలు రావడం సంచలనంగా మారింది. అంతేకాకుండా జిన్‌పింగ్‌ను కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడిగా, చైనా ఆర్మీ చీఫ్‌గా తొలగించారనే వార్తలు వైరల్‌గా మారాయి. దేశం మొత్తాన్ని చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) తన చేతుల్లోకి తీసుకున్నట్లు వార్తల్లో పేర్కొన్నారు. అంతేకాదు చైనా కొత్త అధ్యక్షుడిగా లీ కియామింగ్‌ను ఆర్మీ ఎంపిక చేసిందని వార్తలు రావడంతో వెంటనే ఈ న్యూస్ వైరల్‌ అయింది. 


వార్తల సంగతి పక్కనపెడితే కొందరు చైనీయులు కూడా ఇలాంటి పోస్టులే చేశారు. జిన్‌పింగ్‌ను ఆర్మీ.. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిందని, ఆయన స్థానంలో లీ కియామింగ్‌ను కొత్త అధ్యక్షుడిగా నియమించిందని పేర్కొన్నారు.


ఇలా ట్వీట్లు


చైనా ఆర్మీ వాహనాలు సెప్టెంబర్ 22న బీజింగ్ చేరుకున్నాయని, హువాన్‌లై కౌంటీ నుంచి హిబే ప్రావిన్సు ఝాంగ్‍జియాకో సిటీ వరకు 80 కీలోమీటర్ల మేర ర్యాలీగా వెళ్లాయని ఓ చైనా మహిళ వీడియోను షేర్ చేసింది.






ఇదీ విషయం


అయితే చైనాలో జీరో కొవిడ్‌ విధానాన్ని పాటిస్తున్నారు. దీంతో విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన జిన్‌పింగ్‌ విధిగా ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉండి ఉంటారని, అందుకే బహిరంగ ప్రదేశాలకు రాలేదని సమాచారం. కానీ ఈ లోపే జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచారని వదంతులు వ్యాపించాయి.


Also Read: Rajasthan Congress Crisis: గహ్లోత్‌కు షాకిచ్చి దారిలోకి తెచ్చుకున్న అధిష్ఠానం- అధ్యక్ష రేసులో ఆయనే!


Also Read: Lakhimpur Road Accident: యూపీలో ఘోర ప్రమాదం, ప్రైవేట్ బస్, ట్రక్ ఢీ - 8 మంది మృతి