China Covid outbreak: భయంకర దృశ్యాలు- శ్మశానాల వద్ద క్యూలైన్లు, ఆసుపత్రులు హౌస్‌ఫుల్!

ABP Desam Updated at: 27 Dec 2022 10:46 AM (IST)
Edited By: Murali Krishna

China Covid outbreak: చైనాలో శ్మశాన వాటికల వద్ద కుటుంబీకుల మృతదేహాలతో ప్రజలు బారులు తీరుతున్నారు.

చైనాలో భయంకర దృశ్యాలు

NEXT PREV

China Covid outbreak: చైనాలో కరోనా మరణమృదంగం వాయిస్తోంది. నిత్యం వేల మంది కొవిడ్‌ కారణంగా చైనాలో ప్రాణాలు కోల్పోతున్నారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ చైనా మాత్రం గత వారం రోజుల్లో కేవలం ఒకే ఒక్క మరణం నమోదైందని చెబుతోంది. కానీ ఇది అబద్ధమని తెలుస్తోంది. ఎందుకంటే చైనాలో శ్మశానాల వద్ద భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి.






మృతదేహాలతో కుటుంబీకులు బారులు తీరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలో కొవిడ్‌ మరణాల పరిస్థితిని తెలియజేస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్‌ ఫీగల్‌ డింగ్‌  షేర్‌ చేసిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.







మృతదేహాలతో శ్మశానాల వద్ద బారులు తీరిన కుటుంబీకులు.. గంటలపాటు వేచిచూస్తున్న దారుణ పరిస్థితి ఇది. మరోవైపు ఆస్పత్రి మార్చురీలు నిండిపోయి.. కారిడార్లలోనే వరుసగా పెట్టిన మృతదేహాలు కనిపిస్తున్నాయి.                                                    - ఎరిక్ ఫీగల్ డింగ్, అంటువ్యాధుల నిపుణుడు


ఒమిక్రాన్


చైనాలో కరోనా నిబంధనలను ఎత్తేసిన తర్వాత పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. పెరుగుతున్న కేసులతో చైనాలోని ఆసుపత్రులు కిటకిటలడుతున్నాయి. వచ్చే 90 రోజుల్లో చైనాలోని 60 శాతానికి పైగా ప్రజలకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫెఇగ్ల్ -డింగ్ అంచనా వేశారు.


చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ ఆర్ విలువ 16గా ఉందని.. అంటే వ్యాధి సోకిన వ్యక్తి నుంచి 16 మందికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు.



చైనాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చైనాలో ఉన్న ప్రస్తుత ఒమిక్రాన్ వేరియంట్ ఆర్ విలువ 16గా ఉంది. వ్యాధి సోకిన ఒక్క వ్యక్తి వల్ల 16 మందికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. మీరు చేయాల్సిన పని ఒక్కటే.. మీరు, మీ కుటుంబం, మీ పొరుగువారు అంతా.. బైవాలేంట్ వ్యాక్సిన్ తీసుకోండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం ఏంటంటే.. ఎవరైతే రోగాల బారిన పడాలి అనుకుంటున్నారో పడని, ఎవరైతే మరణించాలి అనుకుంటున్నారో మరణించని అని అనుకుంటుంది. "
-                                   ఎరిక్ ఫీగల్ డింగ్, ఎపిడెమియాలజిస్ట్

 



Published at: 27 Dec 2022 10:43 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.