కొన్ని వస్తువుల తయారీలో లేదా ఏదైన వాహన తయారీలో ఏదో ఓ సైంటిఫిక్ రీజన్‌తోనే డిజైన్ చేస్తుంటారు. ఇలాంటి వాటి గురించి మనం పెద్ద పట్టించుకోం. కానీ అలా తయారు చేసేందుకు అసలైన కారణం లేదా ఏదైన శాస్త్రీయ కారణం తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోతుంటాం. సాధారణంగా చాలా మంది విమానంలో ప్రయాణించి ఉంటారు. కానీ విమానంలో ఉండే సీట్లు నీలరంగులోనే ఎందుకు ఉంటాయి అన్న విషయాన్ని మీరెప్పుడైనా ఆలోచించారా.? కేవలం విమానంలోనే కాదు.. చాలా వరకు బస్సుల్లో కూడా బ్లూ సీట్లు కూడా ఉంటాయి. అయితే ఇలా నీలం రంగులో ఉండటానికి కారణం ఏంటి. దీని వెనక ఏదైన సైంటిఫిక్ రీజన్ ఇక్కడ తెలుసుకోండి.
విమానంలో సీట్లు నీలం రంగులోనే ఎందుకు ?
విమానంలో ఆకాశంలో చాలా ఎత్తులో.. అత్యంత వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. అయితే మొదటిసారి విమానం ఎక్కిన వారు చాలా భయాందోళనకు గురవుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో కొంత వరకు వారికి ఉన్న భయాన్ని తగ్గించేందుకు నీలం రంగు తోడ్పతుందనే చెప్పాలి. నీలం రంగు.. మన మనసుకి ప్రశాంత ఇచ్చే గుణం ఉందట. మనలో చాలామందికి ప్రయాణం అంటేనే ఆందోళన, అసౌకర్యం ఉంటుంది. అలాంటిది మొదటిసారి విమానాల్లో ఎక్కేవారు, హై యాటిట్యూడ్ సిక్‌నెస్ ఉండేవాళ్లు, వేగంగా కదిలేటప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు మరి ఏదైన కారణాలతో బయపడే వాళ్లకు ఈ నీలం రంగు నెమ్మదిగా అనిపించేట్టు చేస్తుందట.
నీలి రంగు సముద్రాన్ని, ఆకాశాన్ని, నీటిని, ప్రకృతిలో మనకు కనిపించేవాటిని గుర్తుకు తెచ్చి, మనకు సహజ స్థితిలోకి త్వరగా వెళ్లేందుకు సహకరిస్తుందట. అందుకోసమే.. చాలా వరకు విమానాల్లో సీట్లు అన్నీ నీలం రంగులోనే ఉంటాయి. అంతేకాదు.. మెయిటనెన్స్ పరంగార చూస్తే.. మిగతా అన్ని రంగుల కంటే నీలి రంగు మాపుకు ఆగుతుంది. దుమ్ము, ధూళి పెద్దగా ఎత్తి చూపించదు. మరకలు ఇలాంటివి ఉన్నా.. ఎక్కువగా కనిపించదు. మిగతా అన్ని రంగుల్లో కన్నా నీలి రంగు ప్రయాణికల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని, భరోసాని ఇస్తుందని సర్వేల్లో తేలిందట. ఇదే కన్సప్ట్‌ను రైళ్లల్లో కూడా ఫాలో అవుతారు. చిన్నపాటి పట్టాలపై సూపర్ ఫాస్ట్ గా ప్రయాణించే రైళ్లలోని సీట్లు కూడా నీలం రంగులోనే ఉంటాయి. విమానంలో ప్రయాణించిందుకు ఏ విధంగా అయితే భయపడుతారో.. అదే విధంగా రైళ్లలో ప్రయాణించేందుకు కూడా కొందరు భయాందోళనకు గురవుతుంటారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని, నీలం రంగు సీట్లను ఏర్పాటు చేశారు. ఇక విమానంలో ప్రయాణించే ప్యాసింజర్లు సొంతంగా వెంట తెచ్చుకున్న ఆహారం తినే అవకాశాలు చాలా తక్కువ. టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఫుడ్ కు మనీ చెల్లించినట్లయితే విమానంలో సిబ్బంది ప్రయాణికుల సీటు వద్దకు వచ్చి ఆహారం అందిస్తారు. విమానంలో గాలిలో ప్రయాణిస్తున్నందున ఆహారం రుచి కాస్త వేరేగా ఉన్నట్లు అనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో సమయంలో ఫుడ్ ఫాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకనే ఎయిర్ లైన్స్ సిబ్బంది ద్వారా ప్రయాణికులకు ఆహారాన్ని అందించాలని నిర్వాహకులు భావిస్తారు. విమాన ప్రయాణం సమయంలో ప్యాసింజర్ల కోసం ఆహారాన్ని చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కనుక ఈ ఆహారంతో పెద్ద ఎఫెక్ట్ చూపించదు.