Stocks to watch today, 27 December 2022: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 55 పాయింట్లు లేదా 0.31 శాతం గ్రీన్ కలర్‌లో 18,084 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
మారుతి సుజుకి ఇండియా: వచ్చే ఆర్థిక సంవత్సరానికి రికార్డ్ స్థాయి ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది, నాలుగు SUV మోడళ్లను లాంచ్ చేయడానికి మారుతి సుజుకి ప్రయత్నిస్తోంది. ప్యాసింజర్ కార్ మార్కెట్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న SUV సెగ్మెంట్‌లో, కోల్పోయిన తన మార్కెట్ వాటాను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కొత్త లాంచ్‌లు కంపెనీకి సాయపడతాయి.
DLF: దేశంలో అతి పెద్ద మాల్ అయిన మాల్ ఆఫ్ ఇండియాను నిర్మించిన భూమికి సంబంధించిన వివాదం మీద, 15 రోజుల్లోగా రూ. 235 కోట్లు చెల్లించాలని నోయిడా అథారిటీ ఈ రియల్టర్‌కు నోటీసు జారీ చేసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు టెలికాం అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 6,500 కోట్ల పెట్టుబడితో 5G సేవలు ప్రారంభించింది. తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లో జియో 5G సర్వీస్ ప్రారంభమయింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా: రిటైల్ టర్మ్ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను అన్ని కాల వ్యవధుల్లో 15- 65 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. సవరించిన రేట్లు సోమవారం (26 డిసెంబర్ 2022) నుంచి అమల్లోకి వచ్చాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ల మీద కొత్త రేట్లు వర్తిస్తాయి. దీంతో డిపాజిట్లు 3.00- 6.75 శాతం పరిధిలోకి చేరాయి.
స్పైస్‌జెట్: ఎయిర్‌లైన్ డైరెక్టర్‌గా అజయ్ సింగ్‌ను కొనసాగించడానికి స్పైస్‌జెట్ వాటాదారులు ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో స్పైస్ జెట్ తెలిపింది. రొటేషన్ పద్ధతి వల్ల పదవీ విరమణ చేయాల్సిన డైరెక్టర్‌గా ఉన్న సింగ్, వాటాదారుల నుంచి అవసరమైన మెజారిటీ వల్ల పునఃనియామకం సాధ్యపడుతుంది.
NTPC: ఇటలీలోని మైరే టెక్నిమాంట్ గ్రూప్‌నకు చెందిన భారతీయ అనుబంధ సంస్థ అయిన టెక్నిమోంట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో (Tecnimont Private Limited) నాన్ బైండింగ్ అవగాహన ఒప్పందం (MOU) మీద NTPC సంతకం చేసింది. భారతదేశంలోని NTPC ప్రాజెక్ట్‌లో వాణిజ్య స్థాయి గ్రీన్ మిథనాల్ ఉత్పత్తి కేంద్రాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని సంయుక్తంగా విశ్లేషించడం, ప్రారంభించడం ఈ ఒప్పందం లక్ష్యం.
GR ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్: ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (EPC) మోడ్‌లో మధ్యప్రదేశ్‌లో రూ. 1,095 కోట్ల విలువైన 8 వరుసల ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్ పూర్తి చేసిన ఈ కంపెనీ, దానికి సంబంధించి కంప్లీషన్ సర్టిఫికేట్ పొందింది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: అన్ సెక్యూర్డ్ బాసెల్-III కంప్లైంట్ టైర్-II బాండ్ల జారీ ద్వారా రూ. 1,500 కోట్లు సమీకరించేందుకు సెంట్రల్ బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఇష్యూ బేస్ సైజ్ రూ. 500 కోట్లు, గ్రీన్‌షూ ఆప్షన్ రూ. 1,000 కోట్లు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.