Chennai Rajinikanth Poes Garden House Floods Up : తమిళనాడులోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా చెన్నైలో వర్షాల కాలంగా నగరం మొత్తం ఎక్కడ చూసినా నీరు  కనిపిస్తోంది. అత్యంత పోష్ ఏరియాగా చెప్పుకునే పోయెస్ గార్డెన్‌లో కూడా నీళ్లు నిలబడిపోతున్నాయి. రజనీకాంత్ ఇంట్లోకి నీరు చేరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 



పోయెస్ గార్డెన్‌లోనే నివాసం ఉండే కస్తూరీ కూడా తన పరిస్థితిని వివరిస్తూ ట్వీట్ చేశారు. 


 



 

చెన్నై నగరాన్ని రెండు రోజుల నుంచి వర్షం వదిలి పెట్టడం లేదు. చెన్నైలో ఏకంగా  10 సెం.మీ కంటే ఎక్కవ వర్షపాతం నమోదు అయినట్లుగా ప్రభుత్వం ప్రకటించారు.  మెట్రో పనుల కారణంగా నగరంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో మురుగు నూీరు అంతా రోడ్లపై పారుతోంది.   ఉత్తర చెన్నైలోని అత్యధిక ప్రాంతాలు మంగళవారం నుంచి ఇంకా నీటిలో మునిగి ఉన్నాయి.   



భారీ వర్షాల కారణంగా రైళ్లు, బస్సులు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్నింటిని రద్దు చేయగా..మరికొన్నింటిని వాయిదా వేశారు.చెన్నైలు సెంట్రల్ నుంచి బయలుదేరాల్సిన ఐదు రైళ్లు రద్దు చేశారు. సత్యభామ యూనివర్శిటీ మునిగిపోవడంతో విద్యార్థులు బయటకు వెళ్లిపోయారు.  





  
అల్పపీడనం తీరం చేరుకోవడంతో చెన్నై నగరానికి హై అలర్ట్ ప్రకటించారు.   భారీ వర్ష సూచన కారణంగా ప్రైవేట్ ఐటీ కంపెనీలు అక్టోంబర్ 18 వరకు ఇంటి నుంచి పనిచేయాలని ఉద్యోగులకు సూచించాలని సీఎం ఎంకే స్టాలిన్ ఐటీ కంపెనీలకు పిలుపునిచ్చారు.