Cheetah Helicopter Crash: ఆర్మీ చీతా హెలికాప్టర్ క్రాష్- పైలట్ మృతి!

ABP Desam   |  Murali Krishna   |  05 Oct 2022 06:03 PM (IST)

Cheetah Helicopter Crash: ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ అరుణాచల్‌ ప్రదేశ్‌లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ మృతి చెందారు.

(Image Source: Twitter)

Cheetah Helicopter Crash: భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ జరిగింది

తవాంగ్ ప్రాంతంలో చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడ్డ ఇద్దరు పైలట్లను సమీపంలోని సైనిక ఆస్పత్రికి తరలించారు. అందులో లెఫ్టినెంట్ కర్నల్​ సౌరభ్​ యాదవ్​ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో పైలట్​ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. 

సంతాపం

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలో ఇండియన్ ఆర్మీ చీతా హెలికాప్టర్ క్రాష్ వార్త గురించి తెలిసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.  -                      కిరణ్ రిజిజు, కేంద్ర మంత్రి

Also Read: Nobel Prize 2022 Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

Also Read: RSS chief: 'ఓ జనాభా విధానం ఉండాల్సిందే'- RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు!

Published at: 05 Oct 2022 05:56 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.