ABP  WhatsApp

RSS chief: 'ఓ జనాభా విధానం ఉండాల్సిందే'- RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు!

ABP Desam Updated at: 05 Oct 2022 04:38 PM (IST)
Edited By: Murali Krishna

RSS chief: దేశంలో అన్ని వర్గాల ప్రజలకు వర్తించేలా ఓ సమగ్ర జనాభా విధానాన్ని రూపొందించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

(Image Source: PTI)

NEXT PREV

RSS chief: నాగ్‌పుర్‌లో ఏర్పాటు చేసిన దసరా ర్యాలీలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. వర్గాల-ఆధారిత జనాభా అసమానత ఓ ప్రధాన అంశమని ఈ సందర్భంగా భగవత్ అన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదన్నారు. 



దేశంలో అన్ని వర్గాల వారికి వర్తించేలా ఓ సమగ్ర 'జనాభా విధానాన్ని' రూపొందించాలి. ఎందుకంటే దేశంలో వివిధ వర్గాల జనాభాలో సమతుల్యత ఉండాల్సిన అవసరం ఉంది. జనాభా అసమానతలు భౌగోళిక సరిహద్దుల్లో మార్పులకు దారి తీస్తాయి. కొన్ని వర్గాల్లో జనాభా సమతుల్యత లేని కారణంగా తూర్పు తైమూర్‌, కొసావో, దక్షిణ సూడాన్‌ వంటి కొత్త దేశాలు ఏర్పడ్డాయి.                                                     -   మోహన్ భగవత్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్


చైనాను చూశారా?


జనాభా నియంత్రణపై కూడా మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ వల్ల చైనా పరిస్థితి ఎలా తయారైందో చూడాలన్నారు.



జనాభా నియంత్రణ కోసం మనం ప్రయత్నిస్తున్నాం. ఇలానే చేసిన చైనాలో ఏం జరుగుతోందో ఓసారి చూడాలి. 'ఒకే సంతానం' విధానాన్ని అవలంబించిన చైనా ఇప్పుడు వృద్ధ దేశంగా మారుతోంది. 57 కోట్ల యువత కలిగిన భారత్‌.. మరో 30 ఏళ్ల పాటు యువ దేశంగా కొనసాగనుంది.                                                   -   మోహన్ భగవత్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్


అయితే జనాభాకు అనుగుణంగా వనరులను పెంచుకోవాల్సిన అవసరాన్ని ఉందని భగవత్ అన్నారు.


నాన్‌వెజ్‌పై


ఆహారపు అలవాట్లపై మోహన్ భగవత్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. "తప్పుడు ఆహారం తీసుకుంటే తప్పుడు ఆలోచనలే వస్తాయి" అని వ్యాఖ్యానించారు. మాంసాహారం తీసుకునే వాళ్ల గురించి ఇలా పరోక్ష వ్యాఖ్యలు చేశారు మోహన్ భగవత్. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థైన భారత్ వికాస్ మార్చ్ ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన భగవత్‌ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ గురించి ప్రస్తావిస్తూ.. ఈ కామెంట్స్ చేశారు.



హింసతో కూడుకున్న ఆహారాన్ని తీసుకోవటం మంచిది కాదు. తప్పుడు ఆహారం తింటే తప్పుడు మార్గంలోనే వెళ్తాం. తామసాన్ని కలిగించే ఆహారాన్ని తినకపోవటమే మంచిది. విపరీతమైన హింసతో కూడుకున్న ఆహారం తినకూడదు.                 - మోహన్ భగవత్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ 
 


Also Read: JK Encounter: జమ్ముకశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు- నలుగురు ఉగ్రవాదులు హతం


Also Read: Elon Musk Twitter Deal: ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ నిజమే: ట్విట్టర్ ప్రకటన

Published at: 05 Oct 2022 03:33 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.