Ram - Boyapati Movie Update : రామ్ జోడీగా శ్రీలీల - 'అఖండ' తర్వాత బోయపాటి, తమన్ కాంబినేషన్ రిపీట్

BoyapatiRAPO Movie : బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా శ్రీనివాసా చిట్టూరి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. విజయ దశమి సందర్భంగా చిత్ర బృందం మూడు కీలక అప్‌డేట్స్‌ ఇచ్చింది.

Continues below advertisement

రామ్ పోతినేని (Ram Pothineni) కథానాయకుడిగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 'అఖండ' వంటి భారీ విజయం తర్వాత బోయపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. హీరోగా రామ్ 20వ చిత్రమిది (RAPO20). విజయ దశమి సందర్భంగా చిత్ర బృందం ఈ రోజు మూడు కీలక అప్‌డేట్స్‌ ఇచ్చింది. 

Continues below advertisement

సంగీత దర్శకుడిగా తమన్!
రామ్ - బోయపాటి శ్రీను సినిమాకు ఎస్.ఎస్. తమన్ (S Thaman) ను సంగీతం అందించనున్నారు. 'అఖండ' చిత్రానికి ఆయన అందించిన నేపథ్య సంగీతం విజయంలో ముఖ్య భూమిక పోషించింది. ఆ విజయం తర్వాత మరోసారి తమన్, బోయపాటి కాంబినేషన్ రిపీట్ అవుతోంది.

రామ్ జోడీగా శ్రీలీల!
బోయపాటి శ్రీను సినిమాలో రామ్ పోతినేనికి జంటగా యంగ్ సెన్సేషన్, కొత్త హీరోయిన్ శ్రీలీల (Sreeleela) ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. 'పెళ్లి సందడి'తో తెలుగు తెరకు ఆమె కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత రవితేజ, పంజా వైష్ణవ్ తేజ్ సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. అయితే, ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో ఆమెకు పెద్ద ఛాన్స్ అని చెప్పాలి. 

ఫైట్‌తో షూటింగ్ షురూ! 
గురువారం సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. హై వోల్టేజ్ యాక్షన్ సీన్‌తో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. రెగ్యులర్ షూటింగ్‌కు అంతా రెడీ అయ్యింది. ఈ సినిమా కోసం రామ్ కొత్త లుక్‌లోకి మారారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై  పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. 'ది వారియర్' తర్వాత రామ్ పోతినేనితో ఆయన నిర్మిస్తున్న చిత్రమిది.

Also Read : 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?

పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రామ్ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేయగా... మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి. హిందీలో డబ్బింగ్ అయ్యాయి. ఉత్తరాది ప్రేక్షకుల్లో ఆయన సినిమాలకు డిమాండ్ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరి కలయికలో సినిమా అంటే కచ్చితంగా నార్త్‌లో డిమాండ్ ఉంటుందని చెప్పవచ్చు.

నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ "బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. మా సంస్థకు ఇది ప్రతిష్టాత్మక సినిమా. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం. భారీ నిర్మాణ వ్యయం, ఉన్నత సాంకేతిక విలువలతో సినిమా రూపొందిస్తున్నాం" అని అన్నారు.

ఊర మాస్ కమర్షియల్ చిత్రాలు తీయడంలో, సందేశాత్మక కథలకు వాణిజ్య హంగులు జోడించి చిత్రాలు తెరకెక్కించడంలో తన శైలి ఏంటనేది బోయపాటి శ్రీను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని టాక్. 

Also Read : ది ఘోస్ట్ రివ్యూ: సంక్రాంతి హిట్‌ను నాగార్జున దసరాకు రిపీట్ చేశారా?

Continues below advertisement
Sponsored Links by Taboola