Chandrayaan 3 Launch: అపోలో ప్రయోగాలతో నాసా చంద్రుడి మీద మనుషులను పంపిస్తుంటే ప్రపంచమంతా ఆశ్చర్యంగా చూడటం తప్ప ఇంకేం చేయలేదు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ నుంచి సానా ఆస్ట్రోనాట్స్ అంతా చంద్రుడి మీదకు వెళ్లి వస్తుంటే వాళ్లు తిరిగొచ్చాక చెప్పే సంగతులు నోరు తెరుచుకుని వినటం తప్ప వేరే ఏ దేశం ఏం చేయలేదు. 1972 తర్వాత అమెరికా నాసా చంద్రుడిమీదకు మనుషులను పంపించటం ఆపేసినా..మిగిలిన ఏ దేశం ఇప్పటివరకూ చంద్రుడి మీద మనుషులను పంపించ లేకపోయింది. మళ్లీ నాసా నే ఆర్టెమిస్ ద్వారా చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంది తప్ప మరే దేశం నాసాకు పోటీ ఇవ్వలేదు. కానీ అతి చిన్న అంతరిక్ష పరిశోధనా సంస్థగా మొదలైన భారత్..అమెరికాకు పోటీనిచ్చే రష్యాను దాటుకుని..చంద్రుడి మీద ప్రయోగాలు చేయటం ప్రారంభించింది. అలా చంద్రుడి ప్రయోగాల మిషన్ లో వచ్చిన మొట్ట మొదటి మిషన్ చంద్రయాన్ 1.


చంద్రయాన్ మిషన్ లో భాగంగా 2008 అక్టోబర్ 8న ఇస్రో చంద్రయాన్ 1ను ప్రయోగించింది. PSLV రాకెట్ సహాయంతో శ్రీహరికోట నుంచి నింగిలోకి వెళ్లిన చంద్రయాన్ 1..రెండేళ్ల పాటు పరిశోధనలు చేసేలా ప్రయోగించారు. 2008 నవంబర్‌లో చంద్రుడి కక్ష్యలోకి వెళ్లిన చంద్రయాన్ 1 నుంచి మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ సపరేట్ అయ్యి చంద్రుడిని ఢీకొట్టింది. అలా ఢీకొట్టిన పాయింట్ జవహర్ పాయింట్ అని పేరు పెట్టారు. చంద్రుడిపై జెండాను పంపించిన నాలుగో దేశంగా ఇండియా చరిత్ర సృష్టించింది. చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం 386 కోట్ల రూపాయలు. 


చంద్రుడి ఉపరితలాన్ని రెండేళ్ల పాటు సర్వే చేయటానికి చంద్రయాన్ 1 ను డిజైన్ చేశారు. కెమికల్ కంపోజిషన్ కంప్లీట్ గా మ్యాప్ చేయాలని..చంద్రుడి ధృవాల్లో నీరు ఉందేమో చూడాలని ఇలా చాలా టాస్క్ లు ఉన్నాయి చంద్రయాన్ 1 కి. చంద్రుడి పొరల్లో నీటి ఆనవాళ్లు ఉన్నట్లు కనిపెట్టింది చంద్రయాన్ 1. మూన్ మినరాలజీ మ్యాప్ ను సిద్ధం చేసింది. ఇలా చేసిన ఏకైక దేశం ఇండియానే. 312రోజుల పాటు అధ్భుతమైన ఫలితాలను అందించిన తర్వాత పూర్ థర్మల్ షీల్డింగ్ కారణంగా చంద్రయాన్ 1 తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. 


అనుకున్న టైమ్ కంటే ముందే మిషన్ ముగిసిపోయిన చంద్రయాన్ 1 సాధించిన విజయాలు ఇస్రో చరిత్రలో మర్చిపోలేనివి. అమెరికా కూడా ఆశ్చర్యపోయే స్థాయిలో అతి తక్కువ ఖర్చుతో చంద్రుడి మీద నీరు ఉండేందుకు ఆస్కారం ఉందా లేదా అన్న సంశయాన్ని బద్ధలు కొట్టింది చంద్రయాన్ 1. భవిష్యత్ లో చంద్రుడు భూమికి ఆల్టర్నేటివ్ కాగలడనే ధైర్యం ఇచ్చింది.


చంద్రయాన్ 1 సాధించిన ఈ విజయంతోనే ఇస్రోకి ఎనలేని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫలితంగా చంద్రయాన్ 2 లో మరింత టఫ్ టాస్క్ ను టేకప్ చేయగలిగింది. ఆ ప్రయాణం ఇప్పుడు చంద్రయాన్ 3 వరకూ చేరుకుంది. 


చంద్రయాన్ 2 పనేంటంటే చంద్రుడి మీదకు ఇప్పటివరకూ ఎలాంటి ప్రయోగం జరగని చంద్రుడి దక్షిణ ధృవంపైన ల్యాండర్ ను దింపి రోవర్ ను నడిపించాలని ప్లాన్ చేసింది. కానీ దురదృష్టవశాత్తు చంద్రయాన్ 2 రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ కాలేదు. ఇలా విజువల్స్ లో చూపించాలని ప్రశాంతంగా దిగాల్సిన ల్యాండర్ అనుకోని అవాంతరాలతో చంద్రుడిపైన కూలిపోయింది. మన ఇస్రో అప్పటి ఛైర్మన్ శివన్ అయితే చెప్పలేని వేదన అనుభవించారు. చంద్రయాన్ 2 ఆయన కలల ప్రాజెక్ట్. అందుకే శివన్ ను అప్పుడు ప్రధాని మోదీ ఓదారుస్తుంటే చంటిపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నారు.


ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ పని నేను చేస్తానంటూ చంద్రయాన్ 3 బయల్దేరుతుంది. సేమ్ ప్రాసెస్ ఈసారి సాఫ్ట్ ల్యాండింగ్ కావాలి అంతే. అప్పడు విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞ రోవర్ అని పేర్లు కూడా పెట్టారు. అప్పుడు కాని ఆ ప్రయోగాన్ని మళ్లీ ప్రయత్నిస్తున్నారు. విజయమో వీర స్వర్గమో అన్నట్లే. సైన్స్ కి ఓటమి ఉండదు. కామాలే తప్ప,..ఫుల్ స్టాప్ ఉండదు. చంద్రయాన్ 3 తో మళ్లీ సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని ఓ రోవర్ ను చంద్రుడి దక్షిణ ధృవం పైన చీకట్లోనే ఉంటూ మనిషికి కంటికి కనపడని ఆ వైపు ఏముందో తెలుసుకోవాలనేది ఇప్పుడు ఇస్రో ముందున్న టార్గెట్.