Kolkata News: కోల్‌కత రేప్ అండ్‌ మర్డర్ కేసులో ఆర్జీకర్‌ హాస్పిటల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ సందీప్ ఘోష్‌ సహా ఇన్వెస్టిగేటింగ్ అధికారి అయిన తలపోలీస్స్టేష్ ఆఫీసర్‌ అభిజిత్‌ మొండల్‌ను సెప్టెంబర్ 17 వరకు సీబీఐ తన కస్టడీ లోకి తీసుకుంది. ఈ మేరకు స్థానిక న్యాయస్థానం నుంచి సీబీఐకి అనుమతులు వచ్చినట్లు దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. ఘోష్‌, మొండల్‌ను కలిపి విచారణ జరపనున్నట్లు సీబీఐ తెలిపింది. ఆర్‌జీకర్ రేప్ అండ్‌ మర్డర్‌ కేసు నీరుగార్చే క్రమంలో వీరిద్దరూ కుట్రపూరితంగా వ్యవహరించినట్లు సీబీఐ చెబుతోంది. ఆర్‌జీకర్ మెడికల్ కళాశాల తల పోలీసలు స్టేషన్ పరిధిలోకి వస్తుండగా..  శనివారం సాయంత్రం ఆ పోలీసు స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఆఫీసర్‌గా ఉన్న మొండల్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.  ప్రిన్సిపల్‌ ఘోష్‌ ఇప్పటికే సీబీఐ అదుపులో ఉండగా.. ఈ కేసులో ఘోష్‌కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు ధ్వంసం చేయడం సహా ఎఫ్‌ఐఆర్ నమోదులో అలసత్వం వంటి అంశాలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీబీఐ వివరించింది. ఆర్‌జీకర్ హాస్పిటల్‌లో అవకతవకలకు పాల్పడిన ఘోష్‌ను కాపాడేందుకు ఈ పని చేసినట్లు తమకు ఆధారాలు లభించాయని సీబీఐ కోర్టుకు తెలిపింది.


ఘోష్‌ సూచనల మేరకే ఆలస్యంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన మొండల్‌:


ఆగస్టు 9న ఉదయం 10 గంటలకే జూనియర్ వైద్యురాలుపై అఘాయిత్యం, హత్య జరిగినట్లు తల పోలీసు స్టేషన్ అధికారిగా ఉన్న మొండల్‌కు సమాచారం అందినా రాత్రి 11 వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయక పోవడం వెనుక కుట్ర ఉందని సీబీఐ ఆరోపించింది. ఈ ఘటనలపై సీబీఐ శనివారం ఆయన నివాసానికి వెళ్లి ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టిన అధికారులు.. ఆర్జీకర్ హత్యోదంతం తర్వాత ఘటనను చిన్నదిగా చేసి చూపేందుకు ఘోష్‌, మొండల్ ఇద్దరూ కుట్ర పూరితంగా వ్యవహించినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది.


Also Read: దేశంలో 7 కొత్త వందేభారత్‌లు, జెండా ఊపి ప్రారంభించిన మోదీ


చట్టపరంగా వ్యవహరించక పోవడం, ఎవిడెన్స్‌ల ధ్వంసానికి పాల్పడడం, క్రిమినల్ కుట్ర ఆరోపణలు నమోదు చేశారు. ఆగస్టు 9న ఈ దురాగతం వెలుగు చూసినప్పటి నుంచి వీళ్లిద్దరూ టచ్‌లోనే ఉన్నారని.. రేప్ అండ్ మర్డర్ కేసు దర్యాప్తులో ఘోష్‌ ఆదేశాలకు అనుగుణంగానే మొండల్ వ్యవహరించారని.. సీబీఐ స్పష్టం చేసింది. ఈ కారణంగానే ఘటన వెలుగులోకి వచ్చిన 14 గంటల తర్వాతే ఎఫ్‌ఐఆర్ నమోదైందని వివరించింది. పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టాల్సి ఉన్నా అ విధంగా ఏ విధమైన చర్యలు చేపట్టలేదన్నారు. ఆస్పత్రిలో ఆర్థిక అవతవకలు గుర్తించిన సీబీఐ అధికారులు సెప్టెంబర్‌ 2నే కళాశాల మాజీ ప్రన్సిపల్‌ ఘోష్‌ను అదుపులోకి తీసుకున్నారు.


ఆగస్టు 9న ఆర్జీకర్ ఘోరం వెలుగు లోకి రాగా ఇప్పటి వరకూ ప్రధాన నిందితుడుతో పాటు ముగ్గురిని సీబీఐ అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. ఆర్జీకర్ ఆస్పత్రి రోగుల బాగోగులకు సంబంధించిన కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న టీఎమ్‌సీ ఎమ్‌ఎల్‌ఏ సుదీప్తో రాయ్‌ను కూడా కొద్ది రోజుల క్రితం ఆయన నివాసానికి వెళ్లి సీబీఐ విచారణ చేసింది. స్వయంగా వైద్యుడైన సుదీప్తోరాయ్‌.. ఈ కేసులో సీబీఐకి పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ మరోవైపు జూడాలు నెల రోజుల క్రితం తలపెట్టిన సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం మూడు సార్లు చర్చలకు ఆహ్వానించగా మూడు సార్లు అవి జరగలేదు. ముడో సారి చర్చల కోసం మమత రెండు గంటలపాటు ఎదురు చూసినా.. జూడాలు తమ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకోక పోవడంతో చివరి నిమిషంలో సమావేశానికి వెళ్లకుండానే  సచివాలయం నుంచి వెనక్కి వచ్చారు.


Also Read: 'రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా' - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన