New Vande Bharat Express Trains: దేశంలో ఏడు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌ టాటా నగర్ రైల్వే స్టేషన్ నుంచి టాటా-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా జెండా ఊపి ప్రారంభించగా.. మిగిలిన ఆరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ లను మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. అంతేకాక, మోదీ పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు, ప్రారంభాలు చేశారు.


మోదీ ప్రారంభించిన ఈ రైళ్లు టాటానగర్ - పాట్నా, బ్రహ్మపూర్ - టాటానగర్, రూర్కెలా - హౌరా, డియోఘర్ - వారణాసి, భాగల్ పూర్ - హౌరా,  గయా - హౌరా వంటి 6 కొత్త మార్గాలలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మోదీ ఆదివారం టాటానగర్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ ఒకటి నుంచి టాటా - పాట్నా వందే భారత్ ను ప్రత్యక్షంగా జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. జార్ఖండ్ మీదుగా చాలా వందేభారత్ రైళ్లు వెళ్తాయని అన్నారు. ఒకేసారి ఏడు వందేభారత్ రైళ్లను ప్రారంభించడం సౌత్ ఈస్టర్న్ రైల్వేకు గర్వకారణం అని అన్నారు.