Cash Counted With 36 Machines Loaded On A Truck Biggest Income Tax Raid: ఐటీ అధికారులు పది రోజుల పాటు డబ్బులు లెక్క పెడుతూనే ఉన్నారు. మనుషులతో సాధ్యం కాదని కౌంటింగ్ మెషిన్లు తెచ్చారు. మొద రెండు, మూడు తెచ్చారు. సరిపోవని..బయటపడే కొద్దీ వరుసగా తెస్తూనే ఉన్నారు. చివరికి దొరికినన్ని తెచ్చారు. అలా తెచ్చిన కౌంటింగ్ మిషన్ల సంఖ్య 36. ఈ 36 కౌంటింగ్ మెషిన్లతో పది  రోజుల పాటు డబ్బులు లెక్కబెట్టారు. వాటిని  తీసుకెళ్లడానికి ఏకంగా ఓ ట్రక్కును తీసుకు రావాల్సి వచ్చింది. ఇలాంటి ఐటీ దాడుల గురించి ఎప్పుడూ విని ఉండరు కానీ ఇది నిజంగా జరిగింది. ఎప్పుడో కాదు. ఇంకా ఏడాది కూడా కాలేదు.


డబ్బు చెలామణి తగ్గడంతో ఒడిషా అధికారులకు డౌట్ 


ఒడిషాలో చలామణిలోకి రావాల్సిన డబ్బు చాలా వరకూ బ్యాంకుల వద్దకు రావడం లేదు. అలాగే ప్రజల వద్దా లేదు. ఏమమవుతుందో ఐటీ అధికారులకు అర్థం కాలేదు. ఆరా తీస్తే మద్యం వ్యాపారాలు చాలా వరకూ తమ వ్యాపారంలో వసూలు చేస్తున్న సొమ్మును బ్యాంకుల్లో జమ చేయడం లేదని అర్థమయింది. వెంటనే రెయిడ్స్ కు ప్లాన్ చేశారు. ఒడిషాలోని మద్యం వ్యాపారుల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. వారితో సంబంధం ఉన్న ఇతర రాష్ట్రాల వ్యాపారుల గురించి కూడా ఆరా తీశారు. గత ఏడాది అంటే 2023 డిసెంబర్‌లో అతి  పెద్ద రెయిడ్‌కు ప్లాన్ చేశారు. ఈ సీక్రెట్ ఆపరేషన్‌ ఉన్నతాధికారులకు తప్ప ఎవరికీ తెలియదు. పెద్ద ఎత్తున రెయిడ్స్ బయలుదేరిన అధికారులు  భువనేశ్వర్‌, సుందర్‌గఢ్‌, బౌద్ధ్‌ జిల్లాలతోపాటు టిట్లాగఢ్‌లోనూ పలువురు మద్యం వ్యాపారుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. 


Also Read: TANAలో 30 కోట్ల గోల్ మాల్ - కోశాధికారే కొట్టేశారు - ప్రవాసాంధ్రుల పరువు పోయినట్లే !


2023 జనవరిలో మద్యం వ్యాపారులపై రెయిడ్ 


ఐటీ అధికారులు అనుకున్నదే నిజం అయింది మిగతా వాళ్ల సంగతేమో కానీ..   టిట్లాగఢ్‌ పట్టణంలో ఉంటున్న దీపక్‌ సాహు, సంజయ్‌ సాహు, రాకేశ్‌ సాహు అనే సోదరుల ఇళ్లలో బయటపడినంత డబ్బు గతంలో ఎప్పుడూ చూసి ఉండరు. వారి ఇళ్లల్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే. ఐటీ అధికారులు కాదు కదా.. ఎవరు వచ్చినా అడ్డంగా దొరికిపోతామని తెలిసినా బహిరంగంగానే డబ్బులు కట్టులు ఇంట్లో పెట్టుకున్నారు. వారి ఇళ్లలో సోదాలు చేయడం ఐటీ అధికారులకు కష్టం కాలేదు. దొరికిన డబ్బును కౌంట్ చేయడానికే వారికి సమస్య అయింది. కౌంటింగ్ మిషన్లను ..మనుషులను తెప్పించి కౌంటింగ్ చేశారు. దాదాపుగా రూ. ఐదు వందలకోట్ల నగదు బయటపడింది. ఈ మొత్తాన్ని తీసుకెళ్లడానికి ఏకంగా ట్రక్కును మాట్లాడుకోవాల్సి వచ్చింది. సమీపలోని ఎస్‌బీఐ బ్యాంకులో దాన్ని జమ చేశారు. 



Also Read: Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు




అంతకు ముందు బీహార్‌లో జరిగిన ఓ అతి పెద్ద రెయిడ్ గురించి సినిమాలు వచ్చాయి. హిందీ అజయ్ దేవగణ్ హీరోగా రెయిడ్ తీశారు. ఇటీవల రవితేజ హీరోగా హరీష్ శంకర్ అదే సినిమాను రీమేక్ చేశారు. హిందీలో బీభత్సమైన హిట్ అయింది కానీ తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ  రెయిడ్ ఎలాంటి టెక్నాలజీ సపోర్టు లేని రోజుల్లో జరిగింది. కానీ ఒడిషా మద్యం వ్యాపారుల ఇళ్లల్లో జరిగింది మాత్రం పూర్తిగా ఇటీవల. అంత డబ్బును ఇళ్లల్లో పెట్టుకుంటారని ఐటీ అధికారులు కూడా అనుకోలేదు.