Pawan expressed impatience with the Kakinada MLA regarding rice smuggling: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో అక్రమంగా రైస్ స్మగ్లింగ్ చేస్తున్న వ్యవహారంపై సీరియస్ అయ్యారు. కాకినాడ వెల్లిన ఆయన స్మగ్లింగ్ చేస్తూండగా పట్టుకున్న  శాంపిల్స్‌ను పరిశీలించారు. రెండు రోజుల కిందట పెద్ద ఎత్తున ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యం ఆఫ్రికాకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్లుగా గుర్తించారు. అప్పటికే షిప్ సముద్రంలోకి వెళ్లిపోయింది. విషయం తెలిసిన కలెక్టర్ షిప్‌ను ఛేజ్ చేసి పట్టుకున్నారు. దీంతో పవన్ కాకినాడకు వెళ్లి ఈ స్మగ్లింగ్ ఎందుకు ఆగడం లేదో పరిశీలించాలని నిర్ణయించారు. 


ఎమ్మెల్యే కొండబాబుపై పవన్ అసహనం            


లోకల్ ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన వనమాడి వెంకటేస్వరరావు ఉన్నారు. పవన్ పర్యటనకు ఆయన కూడా వచ్చారు.  పోర్టులోకి రైస్‌ ఎలా వస్తుందని ఎమ్మెల్యేను పవన్ ప్రశ్నించారు. మీరు సరిగా ఉంటే రైస్‌ ఎలా వస్తుందని..  మీరు కూడా కాంప్రమైజ్‌ అయితే ఎలా అందుకేనా మనం పోరాటం చేసింది అని ప్రశ్నించారు. పోర్టు అధికారులపైనా మండిపడ్డారు. ఈ రైస్ ను ఎగుమతి చేసేందుకు .. పోర్టులో ఎక్కించేందుకు అంగీకరించిన అదికారుల పేర్లు  రాసుకోవాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. తర్వాత పవన్ సముద్రంలో రైస్ స్మగ్లింగ్ చేస్తున్న షిప్ వద్దకు ప్రత్యేక బోటులో వెళ్లి పరిశీలన జరిపారు.           


Also Read:  సచివాలయం ఉద్యోగ సంఘం నేత వెంకటరామిరెడ్డి మందుపార్టీ- అరెస్టు చేసిన పోలీసులు


బియ్యం స్మగ్లింగ్ మాఫియా కట్టడికి ఐదు నెలలుగా చర్యలు 


కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన తరపున మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్‌కు పౌరసరఫరాల శాఖ కేటాయించారు. రాష్ట్రానికి చెందిన రేషన్ బియ్యం ఎక్కువగా కాకినాడ పోర్టు నుంచి లక్షల టన్నులను తరలించారన్న ఆరోపణలు ఉండటంతో..కాకినాడలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ రైస్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే బియ్యం స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో కలెక్టర్ ప్రత్యేక నిఘా పెట్టి షిప్‌ను పట్టుకున్నారు.          



Also Read:  నాడు అనంతబాబు నేడు శ్రీకాంత్‌- హత్య కేసులో బెయిల్‌పై విడుదలైనప్పుడు చేస్తున్న హంగామాపై విమర్శలు


ఎన్నికల ప్రచారంలో ద్వారంపూడిని చాలెంజ్ చేసిన పవన్ 


గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రధానంగా ఈ బియ్యం స్మగ్లింగ్‌లో కీలక వ్యక్తిగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పవన్ కల్యాణ్‌ కాకినాడలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ద్వారంపూడి స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని బయట పెట్టి జైలుకు పంపిస్తామని చాలెంజ్  చేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ అదే పనిలో ఉన్నారు. ఆఫ్రికా దేశాలకు పంపుతున్న  బియ్యం.. ఎలా వచ్చిందో దర్యాప్తు చేస్తున్నారు. పవన్ స్వయంగా కాకినాడ పోర్టుకు వచ్చి పట్టుబడిన బియ్యాన్ని పరిశీలించడం హాట్ టాపిక్ గా మారింది.