సమయం సందర్భం వచ్చినప్పుడు తన పెళ్లి గురించి చెబుతానని కీర్తి సురేష్ గతంలో ఈసారి చెప్పింది. ఎవరెవరితోనో ముడి పెడుతూ తన పెళ్లి గురించి కథనాలు వచ్చిన తరుణంలో మహానటి స్పందించింది. ఇప్పుడు నిజంగా నిజ జీవితంలో ఏడు అడుగులు వేయడానికి రెడీ అయ్యింది. తొలిసారి ఆమె నోటి వెంట పెళ్లి మాట వచ్చింది. 


కుటుంబంతో తిరుమలకు వచ్చిన కీర్తి సురేష్
Keerthy Suresh visits Triumala and offer prayers to lord Venkateswara: కీర్తి సురేష్ శుక్రవారం ఉదయం ఏడు కొండల వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. తండ్రి సురేష్, తల్లి మేనక, ఇంకా కొంత మంది కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చి వెళ్లారు.


తిరుమల దర్శనం గురించి కీర్తి సురేష్ (Keerthy Suresh)ను మీడియా ప్రశ్నలు వేయగా... ''నేను నటించిన హిందీ సినిమా 'బేబీ జాన్' త్వరలో విడుదలకు రెడీ అవుతుంది. అలాగే, వచ్చే నెలలో నా పెళ్లి ఉంది. గోవాలో చేసుకుంటున్నాను'' అని ఆవిడ కన్ఫర్మ్ చేశారు.


Also Read: కీర్తి సురేష్ గ్లామర్ గేట్లు ఓపెన్ చేస్తే ఈ రేంజ్‌లో ఉంటుందా... 'బేబీ జాన్' పాటలో రచ్చ రచ్చే



ఆంటోనీతో ఫోటో షేర్ చేసిన కీర్తి సురేష్!
తిరుమల రావడానికి రెండు రోజుల ముందు కీర్తి సురేష్ సోషల్ మీడియాలో తనకు కాబోయే భర్త ఆంటోనీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. అయితే, ఆంటోనీ ఫేస్ కనిపించకుండా, తెలివిగా వెనుక నుంచి దిగిన ఫోటో విడుదల చేశారు. పెళ్లి రోజు ఇద్దరూ జంటగా దిగిన ఫోటోలు షేర్ చేసే అవకాశం ఉంది. 



డిసెంబర్ 11న గోవాలో కీర్తి సురేష్, ఆంటోనీ వివాహం జరగనుంది. కీర్తి హిందూ, ఆయన క్రిస్టియన్. ఏ పద్ధతిలో పెళ్లి చేసుకుంటారు? అని ప్రేక్షకులతో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులలో కూడా సందేహం నెలకొంది. క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకోవచ్చని గుసగుస. లేదంటే రెండు పద్ధతుల్లో చేసుకునే అవకాశం ఉంది. గతంలో కొంత మంది సెలబ్రిటీలు ఆ విధంగా చేశారు కూడా!


Also Read: కియారా అద్వానీ ఏముందిరా... కుర్రాళ్ళ గుండెల్లో నానా హైరానా






ప్రస్తుతం కీర్తి సురేష్ చేస్తున్న సినిమాలు ఏమిటి?
Keerthy Suresh Upcoming Movies: తమిళ హిట్, దళపతి విజయ్ 'తెరి'కి రీమేక్ అయినటువంటి హిందీ సినిమా 'బేబీ జాన్' వచ్చే నెలలో, క్రిస్మస్ సందర్భంగా 25వ తేదీన విడుదల కానుంది. అది కాకుండా తమిళంలో 'రివాల్వర్ రీటా' అని ఒకటి, 'కన్నివీడి' అని మరొకటి చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ కెరీర్ కంటిన్యూ చేసే ఆలోచనలో కీర్తి సురేష్ ఉన్నారట.