Governor Tamilisai News: గవర్నర్ తమిళిసై నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు హైకోర్టుకు వెళ్లారు. గత ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ హైకోర్టులో శుక్రవారం (జనవరి 5) విచారణకు రానుంది. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టుకు వెళ్లారు. వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేస్తూ గత జూలైలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేబినెట్ భేటీలో తీర్మానం చేసింది. మంత్రి మండలి నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై గతేడాది సెప్టెంబర్ 19న రిజెక్ట్ చేశారు. అయితే, ఆ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తు్న్నారు. గవర్నర్‌ తన పరిధి దాటి వ్యవహరించారని, కేబినెట్ కి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే పూర్తి హక్కు ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. దీనిపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది.