Viral News in Telugu: గుజరాత్‌లో దాదాపు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సురేంద్రనగర్‌లోని భొగావో నదిపైన నిర్మించిన ఓ బ్రిడ్జ్ కుప్ప కూలిపోయింది. భారీ వర్షాలకు పూర్తిగా నానిపోయిన వంతెన క్షణాల్లోనే కూలింది. ఉన్నట్టుండి నీటి మట్టం పెరగడం వల్ల కూలిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. అయితే..ఈ బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారన్న వివరాలు తమ వద్ద లేవని అంటున్నారు. అక్కడి గ్రామ సర్పంచ్‌ బ్రిడ్జ్ కూలిపోతున్న వీడియో తీశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. 


"దగ్గర్లోనే ఓ డ్యామ్ ఉంది. అక్కడ నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. అక్కడి నీళ్లు పొంగి ఇటు వైపుగా వచ్చాయి. ఈ ఉద్ధృతిని తట్టుకోలేక వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. బ్రిడ్జ్ నిర్మాణంలో లోపాలున్నాయా లేదా అన్నది మా దృష్టికి రాలేదు. ఈ వంతెన కూలిపోవడం వల్ల రెండు గ్రామాల మధ్య రాకపోకలు తెగిపోయాయి"


- అధికారులు







ఐదేళ్ల క్రితం ఈ వంతెన నిర్మించినట్టు కొందరు చెబుతున్నారు. సరిగ్గా వంతెన వద్దకు వచ్చిన సమయంలోనే అది కూలిపోయేందుకు సిద్ధంగా ఉందని, అది గుర్తించే వీడియో తీశానని సర్పంచ్ చెప్పాడు. నిజానికి ఈ వంతెన నిర్మాణ లోపాలున్నాయన్న ఆరోపణలున్నాయి. వాటిని కొందరు వ్యతిరేకించారని సమాచారం. కానీ ఎవరూ పట్టించుకోలేదని, అందుకే ఇప్పుడిలా కూలిపోయిందనని వాదిస్తున్నారు స్థానికులు.


Also Read: Viral Video: డైరెక్టర్ ఇంట్లోకి చొరబడిన దొంగ, పెంపుడు పిల్లి అరుపులతో అంతా అలెర్ట్ - వీడియో