Telugu breaking News:బీఆర్‌ఎస్‌ లీడర్లు దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణకు హైకోర్టులో ఊరట

Latest Telugu breaking News: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

ABP Desam Last Updated: 07 Mar 2024 01:59 PM
ప్రత్యేక హోదాపై షర్మిల భావోద్వేగ ప్రసంగం- కన్నీటి పర్యంతమైన ఏపీ పీసీసీ చీఫ్‌

AP PCC Chief Sharmila Crying: ప్రత్యేక హోదాపై షర్మిల భావోద్వేగ ప్రసంగం చేశారు. పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొర్రెలను చేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె చేసిన ప్రసంగంలోని ప్రధామైన పాయింట్స్ 
- పదేళ్ల తర్వాత హోదా అనే ఊసే లేదు
- హోదా అంటే ఏంటో అని వింతగా చూస్తున్నారు
- కాంగ్రెస్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని నిర్ణయించుకుంది
- ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజానకు ఎత్తుకున్నది కాంగ్రెస్ 
- ఉద్యమం ఉవ్వెత్తున జరగక పోతే మనకు హోదా రాదు
- 10 ఏళ్లలో ఏ ఒక్కరూ పోరాటం చేసింది లేదు
- ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు
- అంబేడ్కర్ ప్రజలు  గొర్రెలు లెక్క కాదు...సింహాల లెక్క బ్రతకాలి అన్నాడు
- గొర్రెలను బలి ఇస్తారు..సింహాలను బలి ఇవ్వరు అన్నాడు
- హోదా విషయంలో మనం 10 ఏళ్లు గొర్రెలు అయ్యాం
- అందుకే మనల్ని బలి ఇచ్చారు
- మొదటి 5 ఏళ్లు చంద్రబాబు మనలను గొర్రెలను చేశాడు
- తర్వాత జగన్ మరో 5 ఏళ్లు గొర్రెలను చేశాడు
- ఇప్పుడు మనం గొర్రెలం కాదు సింహాలం
- సింహాల లెక్క పోరాటం చేయక పోతే హోదా రాదు
- పోరాడితే పోయేది ఏమి లేదు..బానిస సంకెళ్లు తప్పా
- ఇన్నాళ్లు మనం మంచితనం గా ఉన్నది చాలు
- మంచితనం ఉంటే మనకు హోదా ఇచ్చారా ?
- మంచితనంగా ఉంటే పోలవరం కట్టారా?
- ఆంధ్రులను మోసం చేసిన మోడీ ఒక డి ఫాల్టర్
- మోడీ ఒక KD.
- హోదా వచ్చి ఉంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది
- హోదా వస్తె 15 లక్షల కోట్ల రూపాయలు వచ్చేవి
- అభివృద్ధిలో ఎక్కడో ఉండే వాళ్ళం
- చంద్రబాబు కి రాష్ట్ర అభివృద్ధి లేదు
- రక్తం పంచుకు పుట్టిన జగన్ ఆన్న కి సైతం అభివృద్ధి ధ్యాస లేదు
- మాట ఇచ్చి మడత పెట్టిన ఘనత జగన్ ది
- జలయజ్ఞం కింద YSR కట్టిన ప్రాజెక్ట్ లకి దిక్కులేదు
- వ్యక్తిగత రాజకీయాల కోసం నేను ఆంధ్ర కు రాలేదు
- నాకు రాజకీయాలు కావాలంటే 2019 లోనే ఇక్కడ పార్టీ పెట్టే దాన్ని
- కేవలం హోదా సాధన,విభజన సమస్యల సాధన కోసమే అడుగు పెట్టా
- రాహుల్ ఇచ్చిన మాట పట్టుకొని YSR బిడ్డ ఆంధ్రలో అడుగు పెట్టింది
- హోదాపై మొదటి సంతకం పెడతా అని హామీ ఇచ్చారు కాబట్టే వచ్చా
- హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి లేనే లేదు
- హోదా రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు
- మన రాష్ట్రానికి భవిష్యత్ లేనే లేదు
- ప్రత్యేక హోదా మనకు ఊపిరి
- ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి
- ఊపిరి లేకుండా బ్రతక గలమా ?
- రాష్ట్రమంతా కాంగ్రెస్ శ్రేణులు ఉద్యమించాలి
- హోదా సాధన వరకు విశ్రమించేది లేదు
- పోరాడాలి, కొట్లాడాలి అనే స్ఫూర్తి లేనే లేదు
- ప్రజలను హోదా నుంచి పక్క దారి పట్టించారు
- బీజేపీ కి రాష్ట్రంలో ఒక్క ఎంపీ లేడు,ఒక్క ఎమ్మెల్యే లేడు
- అయినా రాష్ట్రంలో బీజేపీ రాజ్యం ఎలుతుంది
- బాబు,జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు
- బాబు అధికారంలో ఉంటే బీజేపీ ఉనట్లే .జగన్ ఉన్నా బీజేపీ ఉన్నటే
- హోదా వచ్చి ఉంటే వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవి
- 10 ఏళ్లు దాటిన మనకు రాజధాని లేదు
- హైదరాబాద్ 10 ఏళ్లు ఇస్తే అవసరం లేదు అని ఉరుక్కుంటూ వచ్చారు
- వచ్చి ఇక్కడ ఎం ఉద్ధరించారు
- ఒకటి లేదు.. మూడు లేదు
- ఇది మన రాష్ట్రానికి సిగ్గు చేటు
- ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి వేగంగా దూసుకు పోతుంది
- మన రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్ళాం
- ఇదే నిజమైన పరిస్థితి
- కాంగ్రెస్ 5 ఏళ్లు ఇస్తా అంటే..మోడీ 10 ఏళ్లు అని పంగనామాలు పెట్టారు
- బాధ,అవేదన అర్థం అవుతుంది అన్నాడు
- ఆంధ్ర అభివృద్ధి నాది అని మోడీ హామీ ఇచ్చారు
- ఏ ఒక్క హామీ సైతం నెరవేరలేదు
- కేంద్రంలో పదవులు అనుభవించి హోదా సాధన మరిచారు
- హోదా అంటే కేసులు పెట్టారు
- ప్రతిపక్షంలో ఉండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అధికారం వచ్చే సరికి మరిచి పోయారు
- ఒక్క పోరాటం లేదు.ఒక్క రాజీనామా లేదు
- ప్రతిపక్షం, పాలక పక్షం బీజేపీకి తొత్తులు
- టీడీపి బహిరంగ పొత్తు,జగన్ ది కనపడని పొత్తు
- బీజేపీ నిర్ణయాలను ఒక్కరోజు వ్యతిరేకించరు
- మోడీకి ఊడింగం చేస్తున్నారు
- బీజేపీ తో ఉన్న అక్రమ పొత్తులకు కాంగ్రెస్ ప్రతి కార్యకర్త జనాలకు అర్థం అయ్యేలా చెప్పాలి
- బీజేపీ అంటే బాబు,జగన్,పవన్
- వైసీపీ కి ఓటు వేస్తే బీజేపీ కే అని చెప్పాలి
- టీడీపీ కి వేస్తే బీజేపీ కి..జనసెనా కి వేస్తే బీజేపీ కి అని చెప్పాలి
- ఉద్యమాన్ని భుజానకి ఎత్తుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ

చిల్లకల్లు వద్ద ఆటో బోల్తా- ఒక మహిళ మృతి- నలుగురికి గాయాలు


ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు వద్ద వలస కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ వారు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రపురం వాసులుగా గుర్తించారు. ఎక్లాసిన్ పేట కోదాడు చెందిన లావుడియా వరమ్మ (40) అనే మహిళ మృతి చెందారు. 

బీఆర్‌ఎస్‌ లీడర్లు దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణకు హైకోర్టులో ఊరట 

బీఆర్‌ఎస్‌ లీడర్లు దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణకు హైకోర్టులో ఊరట లభించింది.  వీళ్లిద్దరి ఎమ్మెల్సీ దరఖాస్తులను పునఃపరిశీలించాలని గవర్నర్‌ తమిళిసైకు హైకోర్టు సూచించింది. వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా చేయాలని గత ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఆ అభ్యర్థనను గవర్నర్ తిరస్కరించారు. 

లిక్కర్ కేసులో నన్ను అరెస్టు చేయడం పెద్ద విషయం కాదు: కవిత 
ఢిల్లీ లిక్కర్ కేసుపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు.  ఈ కేసులో తనను అరెస్టు చేయడం పెద్ద విషయం కాదన్నారు. రాజకీయాల్లో అరెస్టులు కామన్‌ అన్నారు. ఈ కేసును టీవీ సీరియల్‌లా సాగదీస్తున్నారని తనకు ఇంట్రెస్ట్ పోయిందన్నారు. 

 

మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా

మహీళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు తన రాజీనామా లేఖను పంపారు. 

మధ్యాహ్నం సీఎస్ అధ్యక్షతన ఉద్యోగ సంఘాల సమావేశం- సమస్యల పరిష్కారంపై చర్చలు

ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కానుంది. సీఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరపనుంది. ఈ సమావేశానికి 15 ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ప్రభుత్వం పిలిచింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కారంపై ఆయా సంఘాలతో సీఎస్, ఉన్నతాధికారులు చర్చించనున్నారు. 

Background

Latest Telugu breaking News: ధర్మశాల(Dharmashala) వేదికగా భారత్‌(India), ఇంగ్లాండ్‌(England) మధ్య చివరిదైన ఐదోటెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 3-1తో టెస్టు సిరీస్‌ సొంతం చేసుకున్న టీమిండియా చివరి మ్యాచ్‌లో కూడా నెగ్గి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది. టీమిండియా వెటరన్ స్పిన్నర్‌ అశ్విన్‌, ఇంగ్లాండ్‌ స్టార్ బ్యాటర్‌ బెయిర్‌స్టోలకు ఇది వందో టెస్టు కావడంతో అందరి దృష్టి వీరిపై నెలకొంది.


ఆఖరి టెస్టులోనూ జోరు కొనసాగిస్తుందా?
ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్ట్‌ సిరీస్‌లో దూకుడు మీదున్న ఉన్న టీమిండియా ఆఖరి టెస్టులోనూ అదే జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌ చివరిదైన ఐదో టెస్టులో విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది. ఈ టెస్టు మ్యాచ్‌లో ఓడిపోతే WTC పాయింట్‌ పట్టికలో..భారత్‌ అగ్రస్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉండడంతో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. చల్లటి వాతావరణ పరిస్థితుల కారణంగా ధర్మశాల పిచ్‌ మొదట సీమర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్‌ సాగే కొద్ది స్పిన్నర్ల ప్రభావం కనిపిస్తుంది. 2017లో ఇక్కడ జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో స్పిన్నర్లు కీలకపాత్ర పోషించారు. ధర్మశాల పిచ్‌ వన్‌ సైడెడ్‌గా ఉండదని రెండు జట్లకు అనుకూలిస్తుందని క్రికెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.


అశ్విన్‌ కెరీర్‌లో మైలురాయి
ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి వందో టెస్టు ఆడుతున్న వెటరన్‌ స్పిన్నర్‌ ఆర్‌. అశ్విన్‌పై నెలకొంది. దశాబ్దకాలంగా జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న అశ్విన్‌  కెరీర్‌లో మైలురాయి అయిన వందో టెస్టులో రాణించాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో అదరగొడుతున్న జైస్వాల్‌తో ఎప్పటిలాగే రోహిత్‌ ఓపెనింగ్‌ చేస్తాడు. శుభమన్‌ గిల్‌, సర్ఫారాజ‌్ ఖాన్‌ తుది జట్టులో ఉండనున్నారు. ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమయిన రజత్‌ పటీదార్‌ స్థానంలో మరో యువ ఆటగాడు దేవదత్‌ పడిక్కల్‌ టెస్టు అరంగేట్రం చేశాడు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా నాలుగో టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధ్రువ్‌ జురెల్‌ మరోసారి చెలరేగాలని చూస్తున్నాడు. అశ్విన్‌, జడేజాలు ఆల్‌రౌండర్‌లుగా జట్టులో ఉన్నారు. నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న స్టార్‌ పేసర్‌ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు.


మరోవైపు బజ్‌బాల్‌ ఆటతీరులో ఇంటాబయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఇంగ్లాండ్‌ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్‌ ఓలీ రాబిన్‌సన్‌ స్థానంలో స్పీడ్‌ స్టార్‌ మార్క్‌వుడ్‌ను తీసుకుంది. ఓపెనర్లు జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్‌ మినహా.... ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా వందో టెస్టు ఆడుతోన్న జానీ బెయిర్‌ స్టో దారుణంగా ఫెయిల్‌ అయ్యాడు. జట్టులో స్థానాన్ని కోల్పోయే ప్రమాదంలో పడిన బెయిర్‌స్టో శతక టెస్టులో రాణించాల్సిన అవసరం ఉంది. వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ టెస్టుల్లో 700 వికెట్ల క్లబ్‌కు రెండు వికెట్లు దూరంలో ఉండడంతో ఈ మ్యాచ్‌లో ఆ ఘనత సాధించాలని చూస్తున్నాడు. యువ స్పిన్నర్లు టామ్‌ హార్ట్‌లీ, బషీర్‌లు మరోసారి రాణించాలని కోరుకుంటున్నారు


టీమిండియా ఫైనల్‌ 11
రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, శుబ్‌మన్‌ గిల్‌, ఆకాష్ దీప్, రవిచంద్రన్ అశ్విన్, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్‌, సర్ఫరాజ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దేవదత్ పడిక్కల్, అక్షర్ పటేల్, రజత్ పాటిదార్, 









బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ అండ‌ర్సన్

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.