Telugu breaking News: నేడు రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం
Latest Telugu breaking News:ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
Background
Latest Telugu breaking News: రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం కానుంది. పదిన్నరకు జరిగే భేటీకి ఏడు అంశాలపై తగిన సమాచారంతో రావాలని ఉన్నతాధికారులు సూచించారు. సచివాలయంలో జరిగే కమిటీ భేటీలో ధరణిలో ఉన్న సమస్యలపై చర్చిస్తారు. చెక్‌లిస్ట్, ఎలాంటి విధానం ఫాలో అవ్వాలి. ఎమ్మార్వో, ఆర్డీవో ఎంక్వైరీ రిపోర్టులు, లీగల్ ఫ్రేమ్ వర్క్, భూభారతి స్టేటస్, ఇప్పటి వరకు ఉన్న సమస్యలకు పరిష్కారాలపై కూడా చర్చిస్తారు. ఈ పోర్టల్ నిర్వహిస్తున్న టెర్రాసిస్ కంపెనీ ప్రతినిధులు కమిటీకి సహకరించడం లేదని తెలుస్తోంది.
సిగరెట్ అప్పు ఇవ్వలేదని హత్య
అప్పు నిప్పులాంటిదని పెద్దలు అంటుంటారు. తీసుకున్న అప్పు చెల్లించకపోతే నిత్యం గుర్తొ్స్తూ మనశ్శాంతి లేకుండా చేస్తుందట. ప్రాణాలు కూడా తీస్తుందట. అలాంటి ఘటన విజయవాడలో జరిగింది. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అప్పు తీసుకున్న వ్యక్తి కంటే ఇచ్చిన వ్యక్తి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి ప్రాణాలు తీసేందుకు తెగబడ్డాడో వ్యక్తి. తీసుకున్న అప్పు చెల్లించమని అడిగినందుకు ఏకంగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. అప్పు తీసుకుని చాలా రోజులైందని, చెల్లించమని అడినందుకు ఏకంగా అతని ప్రాణాలు తీసే పని చేశాడు.
నన్నే అప్పు అడుగుతావా..? అంటూ అప్పు తీసుకున్న వ్యక్తి ఇచ్చిన షాపు యజమానిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగింది. దాడిలో షాపు యజమాని తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనలో పెట్రోల్ పోసిన వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు... వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చిన్నపాటి దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని వద్ద శివ కాసులు అనే వ్యక్తి చాలా సార్లు వస్తువులు అప్పు తీసుకున్నాడు.
అయితే అప్పు చెల్లించడంలో శివకాసులు నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడు. మంగళవారం సైతం శివకాసులు దుకాణం వద్దకు వచ్చి సిగరెట్ అప్పు అడిగాడు. దుకాణదారుడు స్పందిస్తూ.. ఇప్పటికే అప్పు బాగా పెరిగిపోయిందని చెప్పాడు. అప్పు తీసుకుని చాలా కాలమైందని, వెంటనే చెల్లించాలని కోరాడు. పాత బాకి చెల్లిస్తేనే అప్పిస్తానని తేల్చి చెప్పేశాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న శివకాసులుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నన్నే డబ్బులు అడుగుతావా అంటూ దుకాణదారుడితో గొడవకు దిగాడు. దీంతోఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో శివకాసులు తనతో తెచ్చుకున్న పెట్రోల్ వెంకటేశ్వర్లుపై పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో శివకాసులుకు కూడా మంటలు అంటుకున్నాయి. ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బడ్డీకొట్టు వ్యాపారి వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉంది. శివకాసులకు స్వల్పగాయాలయ్యాయి. వైద్యులు బాధితులకు వైద్యం అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణం
నిన్న దక్షిణ అంతర్గత కర్నాటక నుండి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వద్ద ఉన్న తూర్పు గాలులలోని ద్రోణి ఈరోజు బలహీనపడింది. నిన్నటి దక్షిణ ఛత్తీస్‌గఢ్ మరియు పరిసర ప్రాంతాలలో వున్న ఉపరితల ఆవర్తనం ఈరోజు మరఠ్వాడా, దాని పరిసర విధర్భ, తెలంగాణ వద్ద సముద్ర మట్టానికి సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు కింది స్థాయిలోని గాలులు నైరుతి, దక్షిణ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని కారణంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.3 డిగ్రీలుగా నమోదైంది. 76 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
Andhra Pradesh Weather: ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, ఆగ్నేయ దిశల్లో గాలులు వీయనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో కూడా వర్ష సూచన ఉందని తెలిపారు. రాయలసీమలో కూడా అక్కడక్కడ జల్లులు పడతాయని వెల్లడించారు. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -