Brave Women in Armed forces :  సైన్యంలో మహిళలు రాణించడమంటే చిన్న విషయం కాదు. కానీ ఇప్పుడు అది చిన్న విషయంగా మారిపోతోంది. ఎందుకంటే మహిళలు ఇప్పుడు త్రివిధ దళాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.  గతంలో వివిధ భారత సైనిక దళాలలో పురుషులు మాత్రమే ముందుండే మహిళలు త్రివిధదళాలలో ఉన్నప్పటికీ ప్రత్యక్ష యుద్ధరంగంలో క్రియాశీలక పాత్రలో ఉండేవారు కాదు. ఇప్పుడు  త్రివిధ దళాల్లో తమ శక్తి యుక్తులను నిరూపించుకుంటూ పురుషులకు దీటుగా సత్తా చాటుతున్నారు. 


సైన్యం త్రివిధ దళాల్లో  భాగమై రణరంగంలో పోరాడి గెలవాలంటే ధైర్యం, ప్రాణాలను పణంగా పెట్టగల మనోస్థితి లక్షణాలతో పాటు యుద్ధనీతి, పోరాట తంత్రాలు, ఆధునిక ఆయుధాలప్రయోగంలో మెలకువ, నైపుణ్యం… ఈ శక్తి యుక్తులన్నీ నేడు మహిళలు అలవర్చుకుంటున్నారు. అన్ని రంగాలతో పాటు దేశ రక్షణలో అనునిత్యం అవిశ్రాంతంగా ప్రతికూల పరిస్థితుల మధ్య మన స్త్రీ శక్తి త్రివిధదళాలలో  సేవలను అందిస్తున్నది. 


యుద్ధ విమానాలూ నడిపేస్తున్నారు ! 


భారత నౌకాదళం ఎమ్‌హెచ్‌ 60ఆర్‌ ‌యుద్ధ హెలికాప్టర్లు నడిపే ఎయిర్‌ ‌బార్న్ ‌టాక్టీషియన్లుగా పని చేసే అవకాశం ఇద్దరు మహిళలకు దక్కింది. ఘజియాబాద్‌కు చెందిన కబ్‌ ‌లెఫ్టినెంట్‌ ‌కుముదునీ త్యాగి, హైదరాబాద్‌కు చెందిన సబ్‌ ‌లెఫ్టినెంట్‌ ‌రితీసింగ్‌, ‌కొచ్ఛీ దక్షిణ నావికాదళ కమాండ్‌ ‌నిఘా విభాగంలో కఠినమైన శిక్షణ పూర్తి చేసుకొని వ్యూహకర్తలుగా దక్కించు కున్నారు. బి టెక్‌ ‌కంప్యూటర్స్ ‌పూర్తి చేసిన ఇద్దరు నావికాదళ అధికారుల నాలుగో తరం సైనిక కుటుంబాల నుండి వచ్చి నేవీలో చేరారు. ఇటీవలే రాఫెల్‌ ‌యుద్ధ విమానాలు నడిపే దళంలోకి మరో మహిళా ఫైలట్‌ అం‌బాలా ‘గోల్డన్‌ ‌యారోస్‌’ ‌స్క్వాడ్రన్‌ ‌కు ఎంపికయ్యారని ప్రకటించారు.


బ్రిటన్ ఇండియన్ మిలటరీలోనే మహిళల ప్రవేశం ! 


1888లోనే బ్రిటీష్‌ ఇం‌డియన్‌ ‌మిలిటరీ నర్సింగ్‌ ‌సర్వీస్సుల్లో మహిళల ప్రవేశం మొదలైంది.  2007లో యూయన్‌ ‌పీస్‌కీపింగ్‌ ‌ఫోర్స్ ‌లో 105 మందితో మహిళాదళం ఏర్పాటు చేసి లైబెరియాకు పంపారు. 1993లో మ్నెదటిసారి 25 మంది మహిళలు ఆర్మీ ఆఫీసర్లుగా బాధ్యతలు చేపట్టారు.. 2020న ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు మహిళను అన్ని స్థానాల్లోకి తీసుకోవాలని సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పు ఇచ్చింది. 2020లో ఇండియన్‌ ఆర్మీ మెడికల్‌ ‌కోర్‌లో మాధురీ కనిత్కర్‌ ‌పదోన్నతి పొంది లెఫ్టినెంట్‌ ‌జనరల్‌గా విధులు నిర్వహించారు. 2020 రిపబ్లిక్‌ ‌డే పరెడ్‌లో పురుష జట్టుకు వనిత కెప్టెన్‌ ‌తానియా షేర్గిల్‌ ‌మ్నెదటిసారి నాయకత్వం వహించిన మహిళగా కీర్తి తెచ్చుకున్నారు.


కార్గిల్‌ వార్‌లోనూ మహిళల దళాల పాత్ర కీలకం !  


 1995లో ఇండో-పాక్‌ ‌యుద్ధంలో పాల్గొన్న మెడికల్‌ ఆఫీసర్‌ ‌ఫ్లైట్‌ ‌లెఫ్టినెంట్‌ ‌కాంతా హండా, 1999లో కార్గిల్‌ ‌వార్‌లో ఫ్లైట్‌ ఆఫీసర్స్ ‌సక్సేనా, శ్రీవిద్యా రాజన్‌ ‌పైలట్‌ ‌విధులను నిర్వహించి మహిళాశక్తిని నిరూపించారు. 2006లో దీపికా మిశ్రా, 2012లో నివేదితా వైమానిక దళంలో సత్తా చాటారు. 2016లో ఎంపికైన పది మంది మహిళలు పైలట్లుగ నియమితులైనారు. 2019లో భావనాకాంత్‌ ‌మ్నెదటి ఫైటర్‌పైలట్‌గా అర్హత పొందారు. ఇండియన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ ‌ప్రథమ పర్మనెంట్‌ ‌కమీషన్డ్ ఆపీసర్‌గా వింగ్‌ ‌కమాండర్‌ ‌షాలిజా ధామి ఎంపికయ్యారు.  1968లో నావీలో  పుణీత, 2018లో ‘ఐయన్‌యస్‌వి తరణి‘ వర్టికా, స్వాతి, ప్రతిభ, పాయల్‌, ఐశ్వర్య, విజయాదేవికి ‘నారీ శక్తి పురస్కార్‌’ ‌లభించింది. 2019లో శుభాంగీ స్వరూప్‌ ‌మ్నెదటి నావీ పైలట్‌గా నిరూపించుకన్నారు.  


పెరుగుతున్న మహిళల ప్రాతినిధ్యం ! 

 1972లో స్పెషల్‌ ‌ఫ్రాంటీర్‌ ‌ఫోర్స్ ‌కు 500 మహిళలను వివిధస్థాయిల్లో నియమించారు. 1992లో సెంట్రల్‌ ఆర్ముడ్‌ ‌పోలీస్‌ ‌ఫోర్స్ ‌లో ఆశా సిన్హా ప్రథమ మహిళా కమాండంట్‌గా పనిచేశారు. ఆశాతో పాటు అర్చన డిజిపీగా పదవీవిరమణ చేశారు.  సీఆర్‌పియఫ్‌, ‌సిఐయస్‌యఫ్‌ ‌లో 33 శాతం, బియస్‌యఫ్‌, ‌యస్‌యస్‌బి, ఆటిబిపిలలో 15 శాతం మహిళా రిజర్వేషన్లు ఏర్పడ్డాయి.. ఐటిబిపిలో 1500 మంది మహిళలున్నారు. నేషనల్‌ ‌సెక్యూరిటీ గార్డస్‌గా మహిళా కమెండోలను తీసుకున్నారు. 2013లో స్పెషల్‌ ‌ప్రొటెక్షన్‌ ‌ఫోర్స్ ‌కు మహిళలను ఎంపిక చేశారు. రైల్వే ప్రొటెక్షన్‌ ‌ఫోర్స్, ‌నేషనల్‌ ‌డిజాస్టర్‌ ‌రెస్పాన్స్ ‌ఫోర్స్ ‌కూడా మహిళలకు విస్తరించారు. తాము చేయలేని పని ఏదీ లేదని మహిళలు రుజువు చేస్తూనే ఉన్నారు.