AI Clock Poems:
క్లాక్‌లో కవిత్వం
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ చాట్‌బోట్ ChatGPT ఎంత సంచలనం సృష్టిస్తోందో చూస్తూనే ఉన్నాం. గూగుల్‌ను తలదన్నేలా చైనా తీసుకొచ్చిన ఈ చాట్‌బోట్‌పై ప్రయోగాలు చేస్తున్నారు నెటిజన్లు. చెప్పాలంటే...ఆటాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఛాట్ జీపీటీ సాయంతో AI Clockని తయారు చేశాడు. ఈ క్లాక్ స్పెషాల్టీ ఏంటో తెలుసా..? టైమ్ ఎంతో నేరుగా చెప్పదు. దానికి కాస్త పోయెటిక్ టచ్ ఇచ్చేస్తుంది. అంటే..కవిత్వం రూపంలో టైమ్ ఎంతో చెప్పేస్తుంది. డిజైనర్, బ్లాగర్ మ్యాట్ వెబ్ (Matt Webb)ఈ క్లాక్‌ని తయారు చేశారు. ప్రతి నిముషానికి టైమ్ ఎంతో చెప్పడమే కాకుండా రెండు లైన్‌ల కవిత్వమూ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ క్లాక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"నా బుక్‌షెల్ఫ్ కోసం AI Clock తయారు చేశాను. నిముషానికోసారి ఓ పోయెమ్‌ని కంపోజ్ చేసి వినిపిస్తుంది. ఛాట్ జీపీటీ సాయంతో కవిత్వం చెబుతుంది. వీటిని వింటున్న కొద్ది కొత్త అనుభూతి కలుగుతోంది. ఓ ట్రాన్స్‌లో ఉండిపోతున్నాను"
- మ్యాట్ వెబ్, బ్లాగర్
వావ్ అంటున్న నెటిజన్లు..
ఈ క్లాక్‌కు సంబంధించి వరుస ట్వీట్‌లు చేశారు వెబ్. ఈ క్లాక్‌కి Inky wHAT స్క్రీన్ ఫిక్స్ చేసినట్టు చెప్పారు. ఉదయం 11.34 నిముషాలకు ఓ కవిత్వం ఆ స్క్రీన్‌పై కనిపించింది. టైమ్‌తో పాటు "ఇది ఎక్స్‌ప్లోర్ అవ్వాల్సిన టైమ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు..?" అని ఆ స్క్రీన్‌పై కనిపించింది. మరోసారి "ఇది ఎంజాయ్ చేయాల్సిన టైమ్" అంటూ కవిత్వం చెప్పింది. ఇలా టైమ్‌కి తగ్గట్టుగా చిన్న చిన్న కవిత్వాలతో విష్ చేస్తోంది ఈ క్లాక్. ఈ ట్వీట్‌లు చూసిన నెటిజన్లు "కూల్ బ్రో" అని కామెంట్ చేస్తున్నారు. చాట్ జీపీటీని ఇంటిగ్రేట్ చేయడంలో ఇదే బెస్ట్ వే అని అభినందిస్తున్నారు. భలే ఐడియా అంటూ ప్రశంసిస్తున్నారు.