BJP Manifesto HP Election:


భాజపా ఎన్నికల మేనిఫెస్టో..


హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు మరో వారం రోజుల సమయం ఉంది. ఈ లోగా ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు తమ మేనిఫెస్టోలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నికల హామీల జాబితాను వెల్లడించగా..ఇప్పుడు భాజపా కూడా వెలువరించింది. మొత్తం 11 కీలకమైన హామీలను అందులో చేర్చింది. సంకల్ప్ యాత్రలో భాగంగా ఈ మేనిఫెస్టోను విడుదల చేసింది కాషాయ పార్టీ. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేనిఫెస్టోని విడుదల చేశారు. 11 హామీలు నెరవేర్చేందుకు భాజపా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 


ఇవే ఆ హామీలు..


1. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే Uniform Civil Code అమల్లోకి తీసుకొస్తామని భాజపా వెల్లడించింది. ఇప్పటికే దీనిపై కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 
2. ముఖ్యమంత్రి అన్నదాత సమ్మాన్ నిధి కింద రైతులకు అదనంగా రూ.3 వేల ఆర్థిక సాయం
3. 8 లక్షల ఉద్యోగాల కల్పన
4. పీఎం గ్రామీణ్ రోడ్‌లో భాగంగా అన్ని గ్రామాలకూ రోడ్ల నిర్మాణం, ఇందుకోసం రూ.5 లక్షల కోట్లు కేటాయింపు 
5. శక్తి పథకంలో భాగంగా రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో మౌలిక వసతులు, రోడ్ల నిర్మాణం కోసం రూ.12 వేల కోట్ల కేటాయింపు
6. యాపిల్ ప్యాకేజింగ్‌పై జీఎస్‌టీని తగ్గించడం. 
7. ఐదు కొత్త మెడికల్ కాలేజ్‌ల నిర్మాణం. 
8. రూ.9 వేల కోట్ల వ్యయంతో స్టార్టప్ స్కీమ్‌ అమలు, యువతకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం
9. ప్రతి నియోజకవర్గంలో మొబైల్ క్లినిక్‌ వ్యాన్స్‌ల సంఖ్యను పెంచటం
10. అమర వీరుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం పెంపు 
11. వక్ఫ్‌ ఆస్తులపై విచారణ జరపటం 






ఈ హామీలతో ఎన్నికల బరిలోకి దిగనుంది భాజపా. ఇటీవలే కాంగ్రెస్‌ తమ మేనిఫెస్టోని విడుదల చేసింది. లక్ష మందికి ఉద్యోగాలు, పాత పెన్షన్ స్కీమ్‌ని మళ్లీ అమలు చేయడం, హర్ ఘర్ లక్ష్మి పథకంలో భాగంగా ప్రతి ఇంట్లోని మహిళకు నెలనెలా రూ.1500 నగదు బదిలీ లాంటి కీలక అంశాలు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో  4 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌ ఏర్పాటు చేస్తామనీ హామీ ఇచ్చింది కాంగ్రెస్. మొత్తం 10 అంశాలు ఇందులో చేర్చింది. 


1. పాత పెన్షన్ స్కీమ్‌ను మళ్లీ అమలు చేయడం. 
2. 5 లక్షల మంది యువతకు ఉద్యోగాల కల్పన
3. మహిళలకు నెలనెలా రూ.1500 నగదు బదిలీ
4. 300 యూనిట్ల వరకూ అందరికీ ఉచిత విద్యుత్ 
5. పండ్ల ధరలు నిర్ణయించే హక్కు ఉద్యాన పంటలు పండించే వారికే ఇవ్వడం. 
6. యువత కోసం అంకుర సంస్థలు స్థాపించేందుకు రూ.680 కోట్ల నిధులు
7. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 4 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏర్పాటు
8. ప్రతి గ్రామంలో, మొబైల్ క్లినిక్‌లో ఉచిత వైద్యం 
9. పాడి రైతుల నుంచి రోజూ 10 లీటర్ల పాలు కొనుగోలు చేయడం  
10. రూ.2 కిలో చొప్పున పేడను కొనుగోలు చేయడం  


Also Read: HP Election 2022: హిమాచల్‌ప్రదేశ్‌లో ఆప్‌కు అన్ని సీట్లు వస్తాయా? ఆ అంచనాలు నిజమవుతాయా?