ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులకు తాము అభివృద్ధి చేశామని చెప్పుకోవాలనే తాపత్రయం ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోయిందంటే.. దేశంలో ఇది బాగుందే అని అనిపించిన అన్ని ఫోటోలనూ యూపీలోనే కట్టినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అది కూడా ఆదిత్యనాథ్ ప్రభుత్వం కట్టినట్లుగా పోస్ట్ చేసేస్తున్నారు. గతంలో కోల్‌కతాలోని ఓ ఫ్లైఓవర్‌ను మరో భారీ భవనాన్ని ఇలాగే చూపించి ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చి అభాసుపాలయ్యారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో... కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం డ్యామ్‌ను ఉపయోగించేసుకుంటున్నారు. శ్రీశైలం డ్యామ్ ఫోటోలు తీసుకుని బుందేల్‌ఖండ్‌లో యోగి ప్రభుత్వం కట్టిన అతి పెద్ద ప్రాజెక్ట్ అని ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు.
Also Read: కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర పురస్కారం.. రాష్ట్రపతి నుంచి అందుకున్న భార్య, తల్లి
గత వారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుందేల్ ఖండ్ ప్రాంతంలో పర్యటించారు. ఆ తర్వాత బీజేపీ నేతలు శ్రీశైలం డ్యాం ఫోటోతో యోగి ఆదిత్యనాధ్ చేసిన అభివృద్ధి అంటూ ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. ఈ ఫోటోలు వైరల్ అయిపోయాయి. బుందేల్ ఖండ్‌లో అంత పెద్ద ప్రాజెక్ట్ ఎక్కడ ఉందా అని ఆరా తీశారు. కానీ ఎవరికీ కనిపించలేదు. వెదకగా.. వెదకగా అది దక్షిణాదిలోని శ్రీశైలం ప్రాజెక్టుగా తేలింది. దీంతో అసలు విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయట పెట్టారు. యూపీ ప్రభుత్వం పరాయి రాష్ట్రాల్లోని అభివృద్ధిని తాము చేసిన అభివృద్ధిగా చెప్పుకుంటోందని విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: పిల్లలతో ఆ లైంగిక చర్య తీవ్ర నేరం కాదు: అలహాబాద్ హైకోర్టు
యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ కారణంగా అక్కడి రాజకీయ పార్టీలన్నీ యాక్టివ్ గా ఉంటున్నాయి. ఇతర పార్టీల లోపాలను వెలికి తీయడానికి అన్ని రకాల టూల్స్ ఉపయోగించుకుంటున్నాయి. ఈ క్రమంలో బయటకు వస్తున్న ఫేక్ పోస్టులు వైరల్ అవుతున్నాయి. బీజేపీపై సోషల్ మీడియాలో ఇతరులు విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: పరాయి వ్యక్తితో బెడ్‌రూంలో భార్య, భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి.. చివరికి ఏమైందంటే..
యూపీలో ఈ సారి అభివృద్ధి ప్రాతిపదికన ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ నిర్ణయించుకుంది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండటంతో తాము గొప్ప పనులు చేశామని బీజేపీ నమ్మకంగా ఉంది. ఆ అభివృద్ధిని ప్రజల ముందు ఉంచే క్రమంలో అత్యుత్సాహానికి వెళ్లి వేరే రాష్ట్రాల ఫోటోలు వాడుతూండటంతోనే అభాసుపాలవుతోంది.
Also Read: Cheating Woman: తక్కువ ధరకే బైక్ కావాలా నాయనా.. హా కావాలి.. అన్నారో అంతే.. మీ ఆశే ఆమెకి బిజినెస్