ABP  WhatsApp

Kangana on Politics: కంగనాకు పార్టీలోకి స్వాగతం కానీ టికెట్‌ మాత్రం: నడ్డా

ABP Desam Updated at: 30 Oct 2022 11:32 AM (IST)
Edited By: Murali Krishna

Kangana on Politics: కంగనా రనౌత్‌ను భాజపాలోకి స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.

కంగనాకు పార్టీలోకి స్వాగతం కానీ టికెట్‌ మాత్రం: నడ్డా

NEXT PREV

Kangana on Politics: భారతీయ జనతా పార్టీ (భాజపా)లో చేరేందుకు రెడీగా ఉన్నానని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) చేసిన ప్రకటనపై ఆ పార్టీ అధ్యక్షుడు (JP Nadda) జేపీ నడ్డా స్పందించారు. పార్టీ తరఫున కంగనా రనౌత్‌కు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. అయితే ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చే విషయంపై మాత్రం నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు.



కంగనా రనౌత్ మా పార్టీలో చేరాలనుకుంటే ఆమెకు స్వాగతం. పార్టీతో కలిసి పని చేయాలనుకునే ఎవరికైనా మంచి అవకాశం ఉంటుంది. అయితే వారు ఏ హోదాలో ఉండాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. షరతులపై మేము ఎవరినీ తీసుకోం. కంగనా.. ఎన్నికల్లో పోటీ చేయడం విషయానికి వస్తే.. అది నా ఒక్కడి నిర్ణయం కాదు. దాని కోసం క్షేత్ర స్థాయి నుంచి, ఎన్నికల కమిటీ, ఆ తర్వాత పార్టీ పార్లమెంటరీ బోర్డు వరకు సంప్రదింపుల ప్రక్రియ ఉంది. కనుక మీరు బేషరతుగా రండి, మీ హోదాను పార్టీ మాత్రమే నిర్ణయిస్తుందని అందరికీ చెబుతాం.                                         -  జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు


మాదే గెలుపు


హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికలపై కూడా నడ్డా మాట్లాడారు. ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 



హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మేం భారీ విజయం సాధిస్తాం. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు మళ్ళీ భాజపాకే ఓటు వేస్తారు. ఇతర పార్టీల వాగ్దానాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు.                                                        -  జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు


హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 12న జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకే విడతలో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ గడువు 2023, జనవరి 8తో ముగియనుంది.


కీలక తేదీలు



  • నామినేషన్లకు చివరి తేదీ: అక్టోబర్ 25

  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 27

  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 29

  • పోలింగ్ తేదీ: నవంబర్ 12

  • ఓట్ల లెక్కింపు, ఫలితాలు: డిసెంబర్ 8


Also Read: Kangana Ranaut: పొలిటికల్ ఎంట్రీపై కంగనా హాట్ కామెంట్స్- సై అంటే సై!

Published at: 30 Oct 2022 11:27 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.