Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.. తన పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి ప్రజలు కోరుకుంటే, భాజపా తనకు టిక్కెట్ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కంగనా రనౌత్ ప్రకటించారు.
మోదీకి పోటీ లేరు
ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసరగలిగే నాయకుడు లేరని కంగనా అన్నారు. ఈ విషయం ప్రధాని మోదీకి కూడా తెలుసన్నారు.
ప్రస్తుతం కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో దివంగత నేత, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్నారు. ఎమర్జెన్సీ ప్రకటించడానికి కారణం, ఆ సమయంలో జరిగిన ఘటనలపై అదే పేరుతో చిత్రం తెరకెక్కుతోంది. 'ఎమర్జెన్సీ' టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు కంగనా. ఈ టీజర్‌కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందిరా గాంధీగా కంగనా లుక్, హావభావాలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే మణికర్ణిక చిత్రాన్ని తెరకెక్కించిన అనుభవం ఉన్న కంగనా.. ఇప్పుడు మరోసారి మెగాఫోన్ పట్టారు.
Also Read: Delhi NCR AQI: ఢిల్లీలో ఆ నిర్మాణాలన్నింటిపైనా నిషేధం, దారుణంగా పడిపోయిన వాయు నాణ్యత