BJP is working hard in Maharashtra election campaign: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇరవయ్యో తేదీన జరగనున్న పోలింగ్ కు సంబందించి ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ సన్నద్ధం అయ్యాయి. ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలనుకుంటున్న బీజేపీ కూటమి.. గెలిచి తీరాలనుకుంటున్న కాంగ్రెస్ కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీ విస్తృతంగా బహిరంగసభల్లో ప్రసంగిస్తున్నారు. ఇతర అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.
బీజేపీ ఎలక్షనీరింగ్ భిన్నంగా ఉంటుంది. ప్రచారంతో సమానంగా తెర వెనుక ఎలక్షనీరింగ్ ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ అనుబంధ సంఘాలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాయి. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన నేతల్ని ఏరియాల వారీగా ఇంచార్జులుగా నియమిస్తారు. స్థానిక నేతలు అయితే సమన్వయం సాధించడం కష్టం అవుతుంది. ఇతర రాష్ట్ర నేతలు అయితే.. నేతల మధ్య చిన్న చిన్న విబేధాలు ఉన్నా.. ఆ ప్రభావం పార్టీపై పడకుండా ఎలక్షనీరింగ్ నిర్వహించే ఏర్పాట్లు చేస్తారు .
Also Read: బూతులు మాట్లాడారో! మీ కెరీర్ ఖతం : ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు నేతల్ని మహారాష్ట్రకు ఇంచార్జులుగా పంపారు. ఏపీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి నాందేడ్ ప్రాంతానికి ఇంచార్జిగా వెళ్లారు. అక్కడ అగ్రనేతల పర్యటనలను సమన్వయం చేసుకోవడంతో పాటు బహిరంగసభలు, ప్రచార వ్యూహం.. ఎలక్షనరింగ్ పక్కాగా జరిగేలా అక్కడి పార్టీ నేతల్ని సమన్వయం చేసుకుంటున్నారు. తప్పని సరిగా మహారాష్ట్రాలో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, ఫడ్నవీస్ సహా ముఖ్య నేతలంతా రోజూ నాందేడ్ జిల్లాలో పర్యటిస్తున్నారు.
పద్దెనిమిదో తేదీ వరకూ ప్రచారం ఉంటుంది. ఈ ఐదు రోజుల పాటు జోరుగా ప్రచారం జరగనుది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరికొన్ని సభల్లో ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ పార్టీ కూటమి నేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మజ్లిస్ పార్టీ కూడా పోటీ చేస్తోంది. అందుకే ఈ సారి ఎన్నికల ఫలితాలపై ఆసక్తి ఏర్పడింది. సహంజగానే వ్యూహాత్మక ప్రచారం చేసే బీజేపీ .. ప్రచారంలో ముందు ఉందని అనుకోవచ్చు.
Also Read: తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ - సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయిన వారికి జీతాలుగా ప్రజాధనం ?