Nitish Kumar On Prashant Kishor: 'ఆయనకు కుర్రతనం ఇంకా పోలేదు'- పీకేకు సీఎం నితీశ్ కుమార్ కౌంటర్

ABP Desam   |  Murali Krishna   |  21 Oct 2022 01:03 PM (IST)

Nitish Kumar On Prashant Kishor: బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌పై ఫైర్ అయ్యారు.

పీకేకు సీఎం నితీశ్ కుమార్ కౌంటర్

Nitish Kumar On Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. తనపై చేసిన ఆరోపణలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. భాజపాకు నితీశ్ కుమార్ ఇంకా టచ్‌లో ఉన్నారనే పీకే చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

అతను (పీకే) తన సొంత పబ్లిసిటీ కోసం మాట్లాడతాడు. అతను ఏది కావాలంటే అది మాట్లాడగలడు. కానీ అవేమీ మేము పట్టించుకోం. అతను ఓ కుర్రాడు. నేను అతనిని ఒకప్పుడు గౌరవించాను. నేను గౌరవించిన వారంతా నన్ను అగౌరవపరిచారు.                   - నితీశ్ కుమార్, బిహార్ సీఎం
 

పీకే

సీఎం నితీశ్‌కుమార్‌ త్వరలో మళ్లీ భాజపా పంచన చేరుతారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవల విమర్శలు చేశారు. ఊపిరి ఉన్నంత వరకు భాజపాతో కలవనని నితీశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. బిహార్‌లోని పశ్చిమచంపారన్‌ జిల్లాలో పాదయాత్రలో మద్దతుదారులను ఉద్దేశిస్తూ పీకే ప్రసంగించారు.

భాజపాతో ఆయన తెగదెంపులు చేసుకున్నారా? అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ఇంకా ఆ పార్టీతో టచ్‌లోనే ఉన్నారు. ఇందుకు సాక్ష్యం కూడా ఉంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఇంకా కొనసాగుతున్న జేడీయూ నేత హరివంశ్‌ అందుకు సాక్ష్యం. ఇప్పటికే ఆయన్ని పదవి నుంచి తప్పుకోవాలని నితీశ్‌ ఆదేశించి ఉండాల్సింది. లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది. కానీ అలా జరగలేదు. ఎందుకంటే హరివంశ్‌ ద్వారా నితీశ్‌ ఇంకా భాజపాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.              -    ప్రశాంత్‌ కిశోర్, ఎన్నికల వ్యూహకర్త

Also Read: Arunachal Pradesh Chopper Crash: అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ క్రాష్!

Published at: 21 Oct 2022 12:55 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.