Arunachal Pradesh Chopper Crash: అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ సైనిక హెలికాప్టర్ క్రాష్ అయింది. అప్పర్ సియాంగ్ జిల్లాలోని ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగింగ్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. 






ప్రమాదం జరిగిన ప్రదేశానికి రోడ్డు మార్గం లేదని, రెస్క్యూ టీమ్‌ను వెంటనే పంపినట్లు రక్షణ శాఖ పేర్కొంది.






ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీకి చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైందనే వార్త కలిచివేసిందని రిజిజు అన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకూడదని ఆయన ప్రార్థించారు.


ఇటీవల


ఇటీవల హెలికాప్టర్‌ కూలిన ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. అక్టోబర్‌ 18న ఉత్తరాఖండ్‌లో ఇలాంటి ఘోర ప్రమాదమే జరిగింది. ఫాటా నుంచి కేదార్‌నాథ్ యాత్రికులను తీసుకువెళుతున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.


సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ కోసం ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానించారు.



ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఉదయం 11:40 గంటలకు ఈ ఘటన జరిగింది. హెలికాప్టర్ కేదార్‌నాథ్ నుంచి గుప్తకాశీ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణం విచారణ తర్వాత తెలుస్తుంది.                         "
- సీ రవిశంకర్, ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ సీఈఓ



Also Read: PM Modi Kedarnath Visit: కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లను సందర్శించిన మోదీ- పలు ప్రాజెక్టులకు శ్రీకారం


ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.