‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు హీరోగా, అందాల ముద్దుగుమ్మలు పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జిన్నా’. ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కింది. కోన వెంకట్ ఈ సినిమాకు కథ, స్ర్కీన్ ప్లే అందించాడు. దీపావళి కానుకగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఆడియెన్స్ ఏమంటున్నారు?


చాలా గ్యాప్ తర్వాత మంచు విష్ణు మళ్లీ తెర మీద దర్శనం ఇచ్చాడు. ఆయన చివరగా నటించిన చిత్రం ‘మోసగాళ్లు’ ఓరేంజిలో హిట్ అవుతుందని భావించినా, అనుకున్న స్థాయిలో ఆడలేదు. పూర్తి నిరాశలోకి వెళ్లిపోయిన విష్ణు కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించాక మళ్లీ యాక్టీవ్ అయ్యాడు. గతంలో తనకు మంచి పేరు తీసుకొచ్చిన కామెడీ ఎంటర్ టైనర్ కథాంశంతో ‘జిన్నా’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు ఆడియెన్స్ ను ఎంతో ఆకట్టుకున్నాయి. సినిమా మీద భారీ అంచనాలు పెంచాయి.


మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన మంచు విష్ణు?


ఈ నేపథ్యంలో ‘జిన్నా’ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల చేశారు చిత్ర నిర్మాతలు. ఇప్పటికే ఓవర్సీస్ లో తొలి షో పడింది. ఈ సినిమాను చూసిన ఆడియెన్స్ సోషల్ మీడియా వేదికగా రివ్యూలు ఇచ్చేస్తున్నారు.  చాలా వరకు ఫర్వాలేదు అనే టాక్ వినిపిస్తున్నది. 


ట్విట్టర్‌లో ప్రేక్షకులు తెలిపిన వివరాల ప్రకారం..  “కథ బాగుంది. కానీ, సినిమా కాస్త స్లోగా ఉంది. సన్నీ, విష్ణు పరిచయం దగ్గర్నుంచి ఈ సినిమాకు ఊపొచ్చింది. యాక్షన్ సీన్లు, విజువల్స్ బాగున్నాయి” అంటూ ఓ నెటిజన్ 3.23/5 రేటింగ్ ఇచ్చాడు. మరో నెటిజన్ కూడా సినిమా బాగుందని చెప్పాడు. సన్నీ లియోన్ ఇంటర్వెల్ ట్విస్ట్ అద్భుతంగా ఉందన్నాడు. కామెడీ, పాటలు చాలా బాగున్నాయని వెల్లడించాడు. ఈ సినిమాకు 3/5 రేటింగ్ ఇచ్చాడు. విష్ణు కామెడీ టైమింగ్ ‘ఢీ’ సినిమాను మించి ఉందని మరికొందరు నెటిజన్స్ చెప్పారు. సన్నీ నటన బాగుందని, ఈ సినిమా విష్ణు మాత్రమే చేయగలడని పేర్కొన్నారు. కొందరు ప్రేక్షకులు ఈ సినిమాకు సినిమాకు 3/5 రేటింగ్ ఇచ్చింది. ఇంకా ఎవరెవరు ఏమంటున్నారో చూసేయండి.









 






















కొందరు కావాలనే ‘జిన్నా’పై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు!


‘జిన్నా’ మూవీ రిలీజ్‌కు ముందే నెగటివ్ పబ్లిసిటీ రావడంతో మంచు విష్ణు స్పందించాడు. కొంత మంది తమ సినిమాపై కూడగట్టుకుని నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాడు. సినిమా విడుదల కాకముందే నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ఈమేరకు ‘జిన్నా’ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్న ట్వీట్ల లింకులను షేర్ చేశాడు.