ABP  WhatsApp

Exit Poll 2024

(Source:  Poll of Polls)

Virodh Diwas: ఎన్నికల వేళ రైతుల పోరు బాట.. సర్కార్ నమ్మించి.. మోసం చేసిందని ఆరోపణ

ABP Desam Updated at: 31 Jan 2022 06:17 PM (IST)
Edited By: Murali Krishna

సాగు చట్టాలపై ఏడాదికి పైగా ఉద్యమం చేసిన రైతులను ప్రభుత్వం మోసం చేసిందని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ ఆరోపించారు.

రాకేశ్ టికాయత్

NEXT PREV

కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్‌ టికాయిత్‌ ఆరోపించారు. ఇందుకు నిరసనగా నేడు సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం), బీకేయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 'ద్రోహ దినం' (విరోధ్ దివస్) పేరిట ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.







గతేడాది వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతు సమస్యలపై జారీ చేసిన లేఖలోని ఏ హామీని ఇంతవరకూ కేంద్రం అమలు చేయలేదని టికాయత్ అన్నారు. కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ) సహా అన్ని సమస్యలు అలానే ఉన్నాయన్నారు.



జనవరి 31 తేదీని దేశవ్యాప్తంగా ద్రోహ దినంగా పరిగణిస్తున్నాం. ఎమ్‌ఎస్‌పీపై మాకు ఇచ్చిన హామీని కేంద్రం నెరవేర్చాలి. అలానే ఏడాది పాటు సాగిన సాగు చట్టాల ఉద్యమంలో రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. ఎన్నికలకు మా నిరసనలకు సంబంధం లేదు. నా ఓటు నేను ఎవరోఒకరికి వేస్తాను. నేను ఎవరికి మద్దతు పలకడం లేదు. ప్రజలు ఈ ప్రభుత్వ పనితీరుతో సంతోషంగా ఉంటే.. వారికే ఓటు వేస్తారు. ఒకవేళ ఆగ్రహంగా ఉంటే.. ఇంకొకరికి వేస్తారు.                                                               -     రాకేశ్ టికాయత్, బీకేయూ నేత


కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ 2020 నవంబర్‌లో రైతులు ఆందోళనలు ప్రారంభించారు. దిల్లీ సరిహద్దుల్లో ఏడాదికిపైగా నిరసనలు కొనసాగించారు. ఎట్టకేలకు ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు గతేడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.


ఈ క్రమంలోనే నిరసనల సమయంలో రైతులపై నమోదు చేసిన కేసుల ఉపసంహరణ, కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై కమిటీ ఏర్పాటుతో పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల పరిష్కారానికి అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం.. ఎస్‌కేఎం నేతలకు లేఖ పంపింది. దీంతో రైతులు గతేడాది డిసెంబరులో దిల్లీ సరిహద్దులను ఖాళీ చేశారు.


Also Read: Kanpur Accident: అదుపుతప్పిన ఎలక్ట్రిక్ బస్సు.. ఐదుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

Published at: 31 Jan 2022 01:24 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.