Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై ఆసక్తిరక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర చేస్తోన్న రాహుల్ గాంధీ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఎవరు ఉంటారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు రాహుల్ ఇలా సమాధానమిచ్చారు.
అందుకే యాత్ర
ప్రజలతో మమేకమవడానికి భారత్ జోడో యాత్ర చేస్తున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. భాజపా- ఆర్ఎస్ఎస్ వల్ల దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చడమే ఈ యాత్ర లక్ష్యమన్నారు.
జోడో యాత్ర విశేషాలు
మొత్తం 3,570 కిలోమీటర్ల మేర ఈ జోడో యాత్ర సాగనుంది. 118 మంది శాశ్వత సభ్యులు ఇందులో పాల్గొంటారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా. పార్టీకి ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. ఇటీవలే వరుసగా పలువురు సీనియర్ నేతలు రాజీనామా చేయటం ఆ పార్టీని గందరగోళంలో పడేసింది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కాంగ్రెస్ ఈ పాదయాత్ర చేపట్టింది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024 ఎలక్షన్స్‌ని టార్గెట్‌గా పెట్టుకుంది.
కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. జమ్ము, కశ్మీర్‌లో ముగుస్తుంది. ఈ యాత్రలో పాల్గొనే వారెవరూ..హోటళ్లలో బస చేయరు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటెయినర్లలోనే బస చేస్తారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కంటెయినర్లను 60 వరకూ అరేంజ్ చేశారు. వీటిలోనే నిద్రించేందుకు బెడ్స్ ఉంటాయి. టాయిలెట్స్, ఏసీలనూ ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, రాహుల్ గాంధీ ఓ కంటెయినర్‌లో ఉంటారు. మిగతా యాత్రికులంతా ఇతర కంటెయినర్లలో బస చేయనున్నారు.
Also Read: RBI on Loan Apps: లోన్ యాప్‌లపై కేంద్రం సీరియస్- RBIకు కీలక ఆదేశాలు!
Also Read: Kim Jong-un: ఇక ఆటోమెటిక్‌గా అణుదాడి- తగ్గేదేలే, కిమ్ కొత్త చట్టం!