Business Man Son Becomes Jain Monk: తండ్రి నుంచి కోట్ల రూపాయల ఆస్తులు వస్తే ఎవరు మాత్రం కాదనుకుంటారు. ఏమీ సంపాదించకుండా, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా హాయిగా లైఫ్ అంతా గడిపేయాలని అనుకుంటారు. కానీ బెంగళూరులోని ఓ బడా బిజినెస్‌మేన్ కొడుకు మాత్రం ఆ ఆస్తినంతా కాదనుకున్నాడు. జైన సాధువుగా మారిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన భార్యతో పాటు 11 ఏళ్ల కొడుకు కూడా సన్యాసం తీసుకున్నాడు. వాళ్ల సన్యాస దీక్ష తీసుకున్న వేడుకని చాలా ఘనంగా జరిపారు. జైన సాధువులుగా మారిన వెంటనే వాళ్ల పేర్లనీ మార్చేశారు. ఇకపై ఈ తల్లికొడుకులు ఇద్దరూ విలాసాలన్నీ వదిలేసి ఆధ్యాత్మిక జీవనం గడపనున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం...గర్భంతో ఉన్నప్పుడే ఆమె జైన సాధువుగా మారిపోవాలని భావించింది. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఆ తరవాత ఇన్నేళ్లకు ఆ నిర్ణయం తీసుకుంది. తల్లిబాటలోనే తనయుడూ నడుస్తున్నాడు. అమ్మతో పాటే నేనూ సన్యాసం తీసుకుంటానని చెప్పాడు. జీవితం అంతా జైన సాధువుగానే గడిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పగానే ఆ తల్లి ఎంతో సంతోషించింది. 






గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఏడాది జనవరిలో వాళ్లు ఈ దీక్ష తీసుకున్నారు. ప్రస్తుతం సూరత్‌లోనే ఉంటున్నారు. అయితే...ఇప్పుడు ఈ తల్లీ కొడుకుల వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో వైరల్ అయిపోయింది. కొడుకు తల నిమురుతూ ఎంతో ఆనందంగా కనిపించింది ఆ తల్లి. తల్లీ కొడుకులు ఇద్దరూ ఒకరికి ఒకరు బొట్టు పెట్టుకుని సన్యాస దీక్ష తీసుకున్నారు. ఆ తరవాత అక్షింతలు వేసుకున్నారు. ఈ వీడియో చివర్లో ఇద్దరూ జైన సాధువుల వస్త్రధారణలో కనిపించారు.