Bengal Cabinet Reshuffle: బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మంత్రివర్గాన్ని రీషఫుల్ చేశారు. ఈ సారి కేబినెట్‌లో తొమ్మిది మంది కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చారు.


ఇందులో బాబుల్ సుప్రియో, స్నేహసిస్ చక్రవర్తి, పార్థ భౌమిక్, ఉదయన్ గుహా, ప్రదీప్ మజుందార్, తజ్ముల్ హుస్సేన్, సత్యజిత్ బర్మాన్ వంటి వారు ఉన్నారు.






ప్రమాణస్వీకారం


కోల్‌కతాలో వీరంతా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు గిరిజన నేత బీర్బహా హన్స్దా, బిప్లబ్ రాయ్ చౌదరి ప్రమాణం చేశారు. కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై దీదీ ఇటీవల కీలక ప్రకటన చేశారు. కొత్తగా నలుగురు లేదా ఐదుగుర్ని కేబినెట్‌లో చేర్చుకుంటామని దీదీ చెప్పారు. అయితే ఏకంగా 9 మందికి అవకాశం కల్పించారు.


చాలా మంది ఏదేదో రాస్తున్నారు. అయితే మొత్తం కేబినెట్‌లో మార్పు చేసే ఆలోచన మాకు లేదు. అయితే కేబినెట్‌లో మార్పులు ఉంటాయి. మంత్రులు సుబ్రతా ముఖర్జీ, సదన్ పాండేలను మేం కోల్పోయాం. పార్థ చటర్జీ జైలులో ఉన్నారు. ఆయనకు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నేను ఒక్కదాన్నే అన్నీ చూసుకోలేను. అందుకే కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేపడతాం.                                                 "


-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

 

పార్థ ఎఫెక్ట్

 

బంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పార్థ చటర్జీని ఈడీ ఇటీవలే అరెస్టు చేసింది. ఆయన సన్నిహితురాలు నటి అర్పిత ముఖర్జీ నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.50 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను జప్తు చేశారు.

ఈ పరిణామాల అనంతరం పార్థ చటర్జీని మంత్రి పదవిని తొలగించారు దీదీ. అంతేకాకుండా పార్టీలోని అన్ని పదవుల నుంచి తప్పించారు.


Also Read: Madhya Pradesh News: దారుణ ఘటన- బెయిల్‌పై విడుదలై అత్యాచార బాధితురాలిపై గ్యాంగ్ రేప్!


Also Read: Woman Kidnapped In TN: సినిమా కాదు బ్రో- గేటు పగలగొట్టి మహిళను కిడ్నాప్ చేసిన 15 మంది, షాకింగ్ వీడియో!