Koramangala Car Accident: బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం... హోసూరు ఎమ్మెల్యే కొడుకు, కోడలు మృతి... విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు

Koramangala Car Accident: కర్ణాటక బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం తమిళనాడుకు చెందిన ఎమ్మెల్యే కొడుకు, కోడలు మృతి చెందారు. ఆడి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

Continues below advertisement

కర్ణాటక రాజధాని బెంగళూరులోని కోరమంగళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆడి కారు విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో 7గురు మరణించారు. తమిళనాడు హోసూరు ఎమ్మెల్యే ప్రకాశ్​ తనయుడు కరుణసాగర, కోడలు బిందు ఈ ప్రమాదంలో మరణించారు. మృతుల్లో మొత్తం ముగ్గురు మహిళలు ఉన్నారు. మంగళ్​ కన్వెన్షన్​ హాల్​ వద్ద సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

Continues below advertisement


 

Also Read: Woman SI Suicide: 'ఈ రోజు చనిపోతున్నా'... సూసైడ్ కి ముందు పుస్తకంలో రాసిన మహిళా ఎస్సై...

ఆరుగురు అక్కడికక్కడే...

ఆరుగురు ఘటనా స్థలంలోనే మరణించారని పోలీసులు తెలిపారు. మరొకరు ఆసుపత్రికి తరలించే క్రమంలో చనిపోయినట్లు పేర్కొన్నారు. మృతులను కరుణసాగర, బిందు, ఇషిత, డా.ధనూష, అక్షయ్​ గోయల్​, ఉత్సవ్​, రోహిత్​గా గుర్తించారు. స్తంభాన్ని ఢీకొని కారులో మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రతను పెంచింది. సామాజిక మాధ్యమాల్లో ప్రమాదానికి సంబంధించిన చిత్రాలు చక్కర్లు కొడుతున్నాయి. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Continues below advertisement