విజయనగరం జిల్లాలో సంచలనం రేపిన మహిళా ఎస్‌ఐ కె. భవానీ సూసైడ్ పై సంచలన విషయం తెలిసింది. ఆత్మహత్య చేసుకునే రోజు తాను ఈ రోజు చనిపోతున్నట్లు ఓ పుస్తకంపై రాసిందని పోలీసులు అంటున్నారు. ఆమె బస చేసిన రూమ్ లో ఓ పుస్తకంలో ఇలా రాసిందని, వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నాయి. మహిళా ఎస్సై గదిలో, ఫోన్‌లో ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. పీటీసీలో ఆమె బస చేసిన గదిలోని ఓ పుస్తకంలో మాత్రం ‘ఈ రోజు చనిపోతున్నా’ అని రాసి ఉందని విజయనగరం ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు.
Also Read: West Godavari: ప్రజాసమస్యలపై నిలదీస్తే లాఠీ ఛార్జ్.. విస్మయం కలిగిస్తున్న పోలీసుల తీరు
అసలేం జరిగిందంటే...
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మహిళా అడిషనల్ ఎస్సై కె.భవానీ విజయనగరం పోలీసు శిక్షణ కాలేజీ హాస్టల్ లో ఆత్మహత్య చేసుకున్నారు. వారం రోజుల కిందట విజయనగరం జిల్లా పీటీసీలో శిక్షణ కోసం వచ్చిన ఎస్సై భవానీ శనివారం అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసు శిక్షణ కాలేజీ (పీటీసీ) హాస్టల్ లో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం మధ్యాహ్నానికే ఆమె శిక్షణ పూర్తయింది. ఆదివారం ఆమె తిరిగి సఖినేటిపల్లికి వెళ్లాల్సిఉంది.
Also Read: Tollywood Drugs : బీ రెడీ ! నేటి నుంచి టాలీవుడ్ స్టార్స్ ఈడీ విచారణ సీరియల్ !
చిన్న వయసులోనే ఉద్యోగం
విధుల్లో చేరే ముందే ఎస్సై ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగింది. భవానీ స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని సాలెంపాలెం గ్రామం. చివరిగా ఆమె విశాఖపట్నంలో ఉన్న తన సోదరుడు శివకు ఫోన్ చేసి శిక్షణ పూర్తయినట్లు చెప్పందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన విజయనగరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2018 బ్యాచ్‌కి చెందిన ఎస్సై భవానీకి రాజోలు స్టేషన్‌లో శిక్షణ అనంతరం సఖినేటిపల్లి పీఎస్‌లో మొదటి పోస్టింగ్ వచ్చింది. అవివాహిత అయిన భవానీ ఎందుకీ అఘాయిత్యానికి పాల్పడిందో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. పోలీసులు వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడిందని ప్రాథమికంగా తేల్చారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. చిన్నవయసులో ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించిన భవానీ అంతలోనే ఆత్మహత్యకు పాల్పడడంతో సహచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Hyderabad Crime News: తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై లైంగిక దాడి.. వివాహిత నిలదీయడంతో..!