Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Baba Ramdev: యోగా గురు రామ్‌ దేవ్ బాబా మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

Baba Ramdev Tongue Slip:

Continues below advertisement

ఏమీ ధరించకపోయినా..

యోగా గురువు రామ్ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళల దుస్తుల గురించి మాట్లాడుతూ నోరు జారారు. "మహిళలు చీరలు కట్టుకున్నా అందంగా ఉంటారు. సల్వార్ వేసుకున్నా బాగానే కనిపిస్తారు. నా కళ్లకైతే...వాళ్లు ఏమీ వేసుకోకపోయినా అందంగా కనిపిస్తారు" అని అన్నారు. ఈ కామెంట్స్ చేసిన సమయంలో వేదికపై మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్ కూడా ఉన్నారు. రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలతో షాక్ అయిన ఆమె...ఆ అసహనాన్ని బయట పెట్టకుండా అలా నవ్వుతూ ఊరుకున్నారు. ఆమెతో పాటు అక్కడ సీఎం ఏక్‌నాథ్ శిందే కొడుకు, ఎంపీ శ్రీకాంత్ శిందే కూడా అక్కడే ఉన్నారు. ఫలితంగా....ఈ వ్యాఖ్యలు ఇంకా దుమారం రేపుతున్నాయి. రాజకీయ నాయకుల సమక్షంలో అలా మాట్లాడుతున్నా ఎవరూ నోరు మెదపకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్రలోని థానేలో
మహిళల కోసం ఓ యోగా సైన్స్ క్యాంప్‌ నిర్వహించారు బాబా రాం దేవ్. ఆ సమయంలో అందరూ సల్వార్ సూట్‌లతో వచ్చారు. ఆ తరవాత జరిగిన కార్యక్రమానికీ మహిళలు అలా సల్వార్‌ సూట్‌లలోనే వచ్చారు. దీనిపై స్పందించిన రామ్ దేవ్‌ బాబా "మరే ఇబ్బంది లేదు. మీరు ఇంటికి వెళ్లి చీరలు కట్టుకోవచ్చు" అని అన్నారు. అంతటితో ఆగకుండా మహిళలు ఏమీ ధరించకపోయినా బాగానే కనిపిస్తారంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ స్పందించారు. మహిళలను కించపరిచినందుకు దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

సల్మాన్‌పై సంచలన వ్యాఖ్యలు..

బాలీవుడ్ బాద్‌షా సల్మాన్‌ ఖాన్‌పై ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు యోగా గురువు బాబా రామ్‌దేవ్. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని బాబా రామ్‌దేవ్ ఆరోపించారు. సల్మాన్‌ ఖాన్‌తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా బాబా ఆరోపణలు చేశారు.  
" సినిమా పరిశ్రమను డ్రగ్స్‌ చుట్టుముట్టింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు. ఆమిర్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటారా? లేదా? నాకు తెలియదు. షారుక్‌ ఖాన్‌ కుమారుడు డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు. ఇక హీరోయిన్ల గురించి 
ఆ దేవుడికి మాత్రమే  తెలుసు. రాజకీయాల్లో కూడా డ్రగ్స్ అడుగుపెట్టింది. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ జరుగుతోంది. డ్రగ్ అడిక్షన్ నుంచి భారత్‌ను విముక్తి చేసేందుకు మనమంతా కట్టుబడి ఉండాలి. దీని కోసం మేము ఉద్యమం చేస్తాం.                                         "
-బాబా రామ్‌దేవ్, యోగా గురువు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఏర్పాటు చేసిన ఆర్యవీర్‌, వీరాంగన సదస్సులో బాబా రామ్‌దేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌, డ్రగ్స్‌ వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.రామ్‌దేవ్‌ బాబా చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో అప్పట్లో వైరల్‌గా అయింది. 

Also Read: Constitution Day 2022: మన రాజ్యాంగం గురించి 10 ఆసక్తికర విశేషాలివే, ప్రస్తుతం ఒరిజినల్ కాపీ అక్కడ చాలా సేఫ్ !

Continues below advertisement