CM Jagan :   భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. 72 ఏళ్లుగా రాజ్యాంగం సామాజికవర్గాల చరిత్రను తిరగరాసిందన్నారు. అణగారిన వర్గాలకు అండగా నిలిచిందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిగా గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన ప్రభుత్వం తమదని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేశామని గుర్తు చేశారు. 





వేర్వేరు భాషలు, కులాలు, ప్రాంతాలు కలిగిన దేశానికి క్రమశిక్షణ నేర్పే రూల్‌బుక్, సామాజిక ప్రతీక రాజ్యాంగమన్నారు. దేశం మారడానికి, ప్రపంచంతో పోటీ పడటానికి రాజ్యాంగం రచించిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. రాజ్యాంగమే మన సంఘ సంస్కర్త కూడా అని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విజయవాడలో అంబేడ్కర్ విగ్రహానికి ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. ఆంగ్ల మాధ్యమం వద్దంటూ చేస్తున్న నయా అంటరానితనం నుంచి విద్యార్థులకు సీబీఎస్‌ఈ అమలు చేస్తున్నామన్నారు. సంస్కరణల ద్వారా వెనుకబాటుతనంపై  దండయాత్ర చేస్తున్న ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక సామాజిక అభ్యున్నతికి ప్రభుత్వం తోడ్పడుతుందని వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  పేర్కొన్నారు.


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అండగా అనేక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మహిళా సాధికారికతకు అర్థం చెబుతూ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాజ్యాంగం మనకు క్రమశిక్షణ నేర్పించే రూల్ బుక్ అని ఆయన అన్నారు. రాజధానికి సేకరించిన భూములను పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించామన్నారు. రాజ్యాంగం అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని తెలిపారు. 35 నెలల్లో మనందరి ప్రభుత్వం మనసు పెట్టి సామాజిక న్యాయం అమలు చేసిందన్నారు.


1949 నవంబర్ 26న భారతదేశం.. రాజ్యాంగాన్ని దత్తత  చేసుకుంది. 1950 జనవరి 26 నుంచి భారత్‌లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఐతే.. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం, జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని మాత్రమే దేశ ప్రజలు ఎక్కువగా జరుపుకుంటున్నారు.2015 నవంబర్ 19న... కేంద్ర ప్రభుత్వం.. నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ.. గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. 2015 అక్టోబర్ 11న ముంబైలో.. సమానత్వ జ్ఞాపిక దగ్గర డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్  విగ్రహానికి పునాది రాయి వేస్తూ.. ఈ ప్రకటన చేశారు.  భారత రాజ్యాంగ ప్రతిని రూపొందించిన రాజ్యాంగ కమిటీకి అంబేద్కర్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు.