Top Gear Movie Song : వెన్నెల వెన్నెల - ఆది, రియా పెళ్లి తర్వాత వచ్చే పాట

Vennela Vennela Song From Aadi Saikumar’s Top Gear Is Out : ఆది సాయి కుమార్ 'టాప్ గేర్'లో సిద్ శ్రీరామ్ పాడిన 'వెన్నెల వెన్నెల' సాంగ్ విడుదలైంది.

Continues below advertisement

లవ్లీ హీరో ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) కథానాయకుడిగా నటించిన సినిమా 'టాప్ గేర్' (Top Gear Telugu Movie). ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ అనుబంధ సంస్థ ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందింది. కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాత. ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహించారు. ఇందులో తొలి పాటను తాజాగా విడుదల చేశారు. 

Continues below advertisement

వెన్నెల... వెన్నెల... పెళ్లి తర్వాత పాట!
'టాప్ గేర్' చిత్రంలో ఆది సాయి కుమార్‌కు జంటగా రియా సుమన్ (Riya Suman)  నటించారు. కథలో భాగంగా వీళ్లిద్దరికీ పెళ్లి అవుతుంది. ఆ సమయంలో వచ్చే 'వెన్నెల వెన్నెల...' పాటను ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఆ పాటను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఆయన బాణీకి సిద్ శ్రీరామ్ గాత్రం తోడు కావడంతో సాంగ్ సూపర్ ఉందని నెటిజన్లు చెబుతున్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం సైతం బావుందని చెబుతున్నారు.  

డిసెంబర్ 30న 'టాప్ గేర్'  
పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'టాప్ గేర్' సినిమాను డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ''ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశంతో ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందించాం'' అని దర్శకుడు శశికాంత్ తెలిపారు. ''సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి'' అని కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మాత చెప్పారు .

ఆదికి జోడీగా రియా!
'టాప్ గేర్' కంటే ముందు రియా సుమన్ తెలుగులో కొన్ని సినిమాలు చేశారు. 'పేపర్ బాయ్', నేచురల్ స్టార్ నాని 'మజ్ను' సినిమాల్లో ఆమె నటించారు. ఇంకా ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేశారని దర్శక నిర్మాతలు తెలిపారు.
'జులాయి', 'అత్తారింటికి దారేది', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'మనం', 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన ప్రవీణ్ పూడి తమ సినిమా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారని కేవీ శశ్రీధర్ చెప్పారు. శ్రీవిష్ణు 'అల్లూరి', బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'సాక్ష్యం' తదితర చిత్రాలకు పని చేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.

Also Read : దర్శకులను దూరం చేసుకుంటున్న విజయ్ దేవరకొండ - యాటిట్యూడ్ కారణమా?

సిద్ శ్రీరామ్ (Sid Sriram) కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాణీ నచ్చితే చాలు... చిన్న పెద్ద తేడాలు లేకుండా పాట పాడతారు. ఈ ఏడాది సిద్ శ్రీరామ్ పాడిన హిట్ సాంగ్స్‌లో 'బాగుంటుంది నువ్వు నవ్వితే...' ఒకటి. అది ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) 'అతిథి దేవో భవ' సినిమాలోనిది. గత ఏడాది సిద్ శ్రీరామ్ హిట్ సాంగ్స్‌లో ఒకటైన 'ఒకే ఒక లోకం నువ్వే' సాంగ్ కూడా ఆది సాయి కుమార్ సినిమాలోనిదే. 'శశి'లో పాట అది. ఇప్పుడు మరో హిట్ సాంగ్ వీళ్ళ ఖాతాలో చేరింది. 

బ్రహ్మాజీ, 'సత్యం' రాజేష్, మైమ్ గోపి, నర్రా శ్రీనివాస్, శత్రు, బెనర్జీ, 'చమ్మక్' చంద్ర, 'రేడియో మిర్చి' హేమంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కళ : రామాంజనేయులు, ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్, కూర్పు : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : గిరిధర్ మామిడిపల్లి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శశికాంత్, నిర్మాత : కేవీ శ్రీధర్ రెడ్డి.

Continues below advertisement